breakfast
నేటి గజిబిజీ లైఫ్ లో సరిగ్గా తినడానికి కూడా టైం దొరకడం లేదు. కడుపు నిండటానికి ఏదో ఒకటి తిని పనిలో మునిగిపోతుంటారు. ఒక్క తినడానికే కాదు వ్యాయామం చేయడానికి , సరిగ్గా నిద్రపోవడానికి కూడా టైం దొరకని వారు చాలా మంది ఉన్నారు. కానీ వీటివల్ల ప్రాణాంతక గుండెజబ్బులు వస్తున్నాయని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ హార్ట్ ఎటాక్, స్ట్రోక్, హార్ట్ వంటి రోగాలు కూడా నేటి కాలంలో కామన్ అయిపోయాయి.
breakfast
మన తాతలు, ముత్తాతలు అయితే నూరేండ్లు ఆరోగ్యంగా బతికేవారు. వారు తినే ఆహారం, ఆరోగ్యం చిట్కాలు, హెల్తీ జీవనశైలి వల్లే ఆరోగ్యంగా గడిపారు. అందులోనూ అప్పట్లో ఇన్ని సౌకర్యాలు, రకరకాల ఫుడ్స్ కూడా లేవు. ఇప్పుడు అన్ని రకాల వసతులు ఉన్నా.. ఆరోగ్యం మాత్రం 30 ఏండ్లకే దెబ్బతింటోంది. మన ఆహారాన్ని, జీవనశైలిని మార్చుకుంటే మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని రకాల ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండటానికి బ్రేక్ ఫాస్ట్ లో ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మజ్జిగ
ఎండాకాలంలో మజ్జిగను ఎక్కువగా తాగుతుంటారు. అదికూడా మధ్యాహ్నమే. కానీ మజ్జిగను ఎండాకాలంలో అన్ని వేళల్లో తాగొచ్చు. ముఖ్యంగా మీ గుండె ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో మజ్జిగను తాగండి. బ్రేక్ ఫాస్ట్ లో మజ్జిగను తాగితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు తగ్గుతాయి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఉప్మా
ఉప్మాను చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉప్మాలో ఇనుముతో పాటుగా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉటాయి. నిజానికి ఉప్మాను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తింటే ఎన్నో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఉప్మా తింటే మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.
దహీ చుడా
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో దహీ చుడాను తిన్నా కూడా మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి కొవ్వు కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న చెడు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో మీకు గుండెజబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
ఇడ్లీ
నెయ్యి, నూనె, మసాలా దినుసులు లేకుండా చేసే ఇడ్లీ కూడా మన గుండె మంచి ప్రయోజకరంగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ తింటే ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు.
Image: Freepik
మూంగ్ దాల్ చిల్లా
పెసరపప్పుతో చేసే మూండ్ దాల్ చిల్లాను కూడా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తినొచ్చు. దీనిలో కొలెస్ట్రాల్, అనారోగ్యకరమైన కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించడానికి సహాయపడుతుంది.