రాత్రిపూట అన్నం తినాలా? చపాతీ తినాలా?

First Published | Jul 23, 2024, 11:42 AM IST

చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. కానీ ఎక్కువ మంది మాత్రం రాత్రిపూట అన్నానికి బదులు చపాతీనే తింటుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రిపూట ఏది తింటే మంచిదో తెలుసా? 
 

తినాల్సిన మోతాదులో తింటే ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది రాత్రిపూట హెవీగా తింటుంటారు. దీనివల్ల కడుపులో నొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. దీంతో రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. అందుకే ఆరోగ్య నిపుణులు రాత్రిపూట తేలికపాటి ఆహారాన్నే తినాలని చెప్తుంటారు. కానీ చాలా మందికి రాత్రిపూట అన్నం తినాలా? రొట్టె తినాలా? ఏది తింటే మంచిది? అన్న డౌట్లు వస్తుంటాయి. అసలు రాత్రి అన్నం, చపాతీలో ఏది తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రాత్రిపూట ఏం తినాలి? 

కొంతమంది రాత్రిపూట అన్నాన్నే తింటే.. మరికొంతమంది ఓన్లీ చపాతీనే తింటుంటారు. ఇంకొందరు కొంచెం అన్నం, ఒకటి రెండు చపాతీలు తింటుంటారు. అసలు రాత్రిపూట అన్నం తింటే మంచిదా? చపాతీ తింటే మంచిదా? తెలియాలంటే ముందు ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. 
 


రాత్రి పూట అన్నం తింటే..? 

చాలా మంది రాత్రి పూట అన్నమే శరీరానికి మంచిదని.. ప్రతిరాత్రి అన్నాన్నే తింటుంటారు. కొంతమందికి రాత్రిఅన్నం తింటేనే నిద్రపడుతుంది. కడుపు నిండినట్టు ఉంటుంది. అయితేబరువు తగ్గాలనుకునేవారు మాత్రం రాత్రిపూట అన్నం తినకపోవడమే మంచిది. ఖచ్చితంగా తినాలనుకుంటే మాత్రం లిమిట్ లో తినాలి. 
 

రాత్రిపూట చపాతీ, రొట్టె తింటే..? 

రాత్రిపూట అన్నాన్నికి బదులుగా చపాతీని తింటుంటారు. అయితే మీరు అన్నం తినకపోతే రోటీని దీనికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. కానీ చపాతీలను కూడా మీరు లిమిట్ లోనే తినాలి. హెవీగా తింటే దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు కలగవు. 
 


అన్నం లేదా రోటీ ఏది మంచిది? 

మీరు రాత్రిపూట అన్నానికి బదులుగా రోటీని తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారని చాలా మంది నమ్ముతారు. రాత్రిపూట రోటీ తినడం అనేది మీరు బరువు తగ్గాలనుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది. 

జీర్ణక్రియకు మంచిది 

రాత్రిపూట రొట్టెలు తినడం వల్ల మీ శరీరం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇవి చాలా సులువుగా జీర్ణమవుతాయి. అందుకే రాత్రిపూట రొట్టెలు తినడం మంచిదని అంటుంటారు. 
 

మెరుగైన నిద్ర

రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తినడం అలవాటు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో మెరుగైన నిద్ర ఒకటి.  తేలికపాటి ఆహారం తొందరగా జీర్ణమయ్యి సక్రమంగా  నిద్ర పడుతుంది.  ఇందుకోసం మీరు రాత్రిపూట రొట్టెను తినాలి.
 

తక్కువ కేలరీలు 

రాత్రిపూట మీరు వీలైనంత వరకు  తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తినండి. దీనివల్ల మీ శరీరానికి మేలు జరుగుతుంది. ఇలాంటి ఆహారాలను తినడం వల్ల మీ శరీరంలో కొవ్వు పెరగకుండా మెటబాలిజం కూడా సక్రమంగా జరుగుతుంది.
 

Latest Videos

click me!