టీని ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. అందులోనూ ఇది వర్షాకాలం. ఈ వర్షకాలంలో వేడి వేడిగా టీ తాగుతూ ఉంటే కలిగే అనుభూతి చాలా హాయిగా ఉంటుంది. కానీ.. చాలా మందికి టీ ని నార్మల్ గా తాగడానికి ఇష్టపడరు. ఆ టీతో పాటు కొన్ని ఫుడ్స్ ని కలిపి తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ... అనని ఫుడ్స్ టీ కాంబినేషన్ లో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. అసలు.. టీ తాగేటప్పుడు అస్సలు తీసుకోకూడని కొన్ని ఆహారాలేంటో ఓసారి చూద్దాం...
దాదాపు పెద్దగా ఎవరూ తొందరగా టీ తాగినప్పుడు పండ్లు తినడానికి ఇష్టపడరు. కానీ.. ఒకవేళ తెలీక పొరపాటు తినే అలవాటు ఉంటే మాత్రం దానిని మానేయడమే బెటర్. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్లు.. ఆరెంజ్, బత్తాయి అలాంటి పండ్లు తీసుకోకూడదు. ఇవి తిని.. టీ తాగినా.. టీ తాగిన తర్వాత ఇవి తిన్నా ఎసిడిటిక్ సమస్య వస్తుంది. స్టమక్ అప్ సెట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ.
ఇక.. చాలా మందికి టీతో కలిపి స్పైసీ ఫుడ్స్ తినే అలవాటు ఉంటుంది. మీకు కనుక ఆ అలవాటు ఉంటే.. ఇప్పుడే ఆపేయడం బెటర్. స్పైసీ గా ఉండే ఏ ఫుడ్స్ టీ కాంబినేషన్ లో తీసుకోకూడదు. దీని వల్ల కడుపులో చాలా సెన్సిటివ్ గా మారే అవకాశం ఉంది. కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఎక్కువగా కారం ఉండే ఆహారాలు మాత్రమే కాదు... షుగర్ ఎక్కువగా ఉండేఫుడ్స్ కూడా టీ కాంబినేషన్్ లో తీసుకోకూడదు. అంటే.. కేకులు, పేస్ట్రీలు, డోనల్స్ లాంటి షుగర్ ఉండే ఫుడ్స్ తీసుకకూడదు.
చాలా మందికి టీ తాగే సమయంలో.. ఉప్పు ఎక్కువగా ఉండే బిస్కెట్లు, పకోడీలు లాంటివి తింటూ ఉంటారు. కానీ...ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ ని టీ కాంబినేషన్ లో తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల బాడీ హడీ హైడ్రేటెడ్ గా మారుతుంది.. దాహం పెరిగిపోయే ప్రమాదం ఉంది.
ఇక.. టీ కాంబినేషన్ లో చీజ్ ని చీజ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం మంచిది కాదు. దాని వల్ల.. టీ రుచి మారిపోయే ప్రమాదం ఉంది. చీజ్ ఉన్న ఫుడ్స్ తిన్న తర్వాత.. టీ తాగినా.. అసలు టీ తాగిన అనుభూతి కూడా కలగదు.
అంతేకాదు.. టీ తాగినప్పుడు ఆయిల్ లో ఫ్రై చేసిన ఫుడ్స్ తినడం కూడా మంచిది కాదు. అంటే... ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ లాాంటివి.. తినడం మంచిది కాదు. ఆయిల్ ఫుడ్స్ టీ తో పాటు.. తీసుకోవడం ఆహారం.. అరుగుదల సమస్యను ఇబ్బంది పెడుతుంది.