వారం రోజులు ఇలా ఓట్స్ తింటే.. బరువు తగ్గడం చాలా ఈజీ..!

First Published | Jul 22, 2024, 12:23 PM IST

ఒక వ్యక్తి రోజులో మూడు పూటలు ఓట్స్ తిని.. చాలా ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు.  ఎందుకంటే.. ఓట్స్ లో సంతృప్తికరమైన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఓట్స్ కి పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా తినే ఆహారాల్లో ఓట్స్ కూడా ముందు వరసలో ఉంటాయి. ఓట్స్ తో మనం చాలా రకాల కమ్మనైనా వంటకాలు చేసుకోవచ్చు. కానీ.. ఎక్కువ మంది అభిప్రాయం ఏమిటంటే... ఓట్స్ బరువు తగ్గాలి అనుకునేవాళ్లు మాత్రమే తినాలి అని అనుకుంటారు. అందులో కూడా నిజం లేకపోలేదు.

ఒక వ్యక్తి రోజులో మూడు పూటలు ఓట్స్ తిని.. చాలా ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు.  ఎందుకంటే.. ఓట్స్ లో సంతృప్తికరమైన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలి బాధలను నివాసిస్తుంది. చిరు తిండ్లు తినాలి అనే కోరికను కూడా తగ్గించేస్తుంది. మరి.. ఓట్స్ ని ఎలా తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..


oats idli


మూడు పూటలా ఓట్స్ తినాలి అంటే బోరింగ్, చాలా కష్టం అనే ఫీలింగ్ మీకు రావచ్చు. కానీ.. వాటిని డిఫరెంట్ రెసిపీలుగా చేసుకుంటే.. కమ్మగా, రుచిగా ఎలాంటి బోర్ లేకుండా ఓట్స్ తినేయవచ్చు. మరీ మూడు పూటలా తినడం కష్టంగా ఉంటే.. రెండు పూటలు ఓట్స్ తిని, మరో భోజనం సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. సలాడ్ తోపాటు.. చికెన్, ఫిష్ లాంటి ప్రోటీన్ ఆహారం కూడా భాగం చేసుకోవచ్చు. అప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి.. ఈజీగా బరువు కూడా తగ్గవచ్చు.

సరిగ్గా వారం రోజుల్లో బరువులో తేడా తెలియాలంటే.. ఓట్స్ ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...
వారం రోజుల డైట్ లో భాగంగా   మొదటి రెండు రోజులు రోజుకు మూడు భోజనంలో కేవలం ఓట్‌మీల్‌ను తినడం ప్రారంభిస్తారు, తర్వాత రెండు రోజులు కనీసం రెండు పూటలా వోట్‌మీల్ తినడం ప్రారంభిస్తారు.  చివరగా,  మిగిలిన మూడు రోజులు రోజుకు ఒక భోజనం కోసం వోట్మీల్ తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల.. బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు కూడా అందుతాయి.

ఓట్స్ తో ఎన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చో కూడా ఇప్పుడు చూద్దాం..

1. ఓట్స్ ఖిచడీ: ప్రసిద్ధ భారతీయ ఆహారమైన ఖిచడీకి ఆరోగ్యకరమైన వెర్షన్ ఓట్స్ ఖిచడీ. రుచికరమైన వంటకం తయారు చేయడం సులభం. కడుపు ఎక్కువ సేపు నిండిన అనుభూతి కలుగుతుంది.

2.వోట్స్ ఉతప్పం: దక్షిణ భారత ఇష్టమైన ఒక రుచికరమైన , ఆరోగ్యకరమైన వంటకం, వోట్స్ ఉత్తపం. బెస్ట్ బ్రేక్ ఫాస్ట్  అని చెప్పొచ్చు. చాలా హెల్దీ కూడా.

3. వేయించిన గుడ్డుతో ఓట్‌మీల్ గంజి: లంచ్ రెసిపీగా కూడా రెట్టింపు చేయగల అల్పాహార వంటకం, వేయించిన గుడ్లతో కూడిన ఓట్‌మీల్ గంజిలో సరైన మొత్తంలో ఫైబర్ , ప్రోటీన్‌లు ఉంటాయి.
4. ఓట్స్ ఇడ్లీ: ఈ రెసిపీ సెమోలినాను ఓట్స్‌తో భర్తీ చేయడం ద్వారా ఇడ్లీ  ఆరోగ్య భాగాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళుతుంది.

ఓట్స్ ప్రయోజనాలు...
ఓట్స్ తినడం వల్ల.. కేవలం బరువు తగ్గడమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి గుండె సంబంధిత సమస్యలను తగ్గించవచ్చు.  ప్రేగు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. వాటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.

మీ రోజువారీ ఆహారంలో ఓట్స్ చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు. వాటిని మీ అల్పాహారం భోజనంలో భాగంగా చేసుకోండి.
 ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, రోజువారీ ఆహారంలో ఓట్స్ తప్పనిసరిగా చేర్చుకోవాలి. చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

Latest Videos

click me!