ప్రతిరోజూ వెల్లుల్లి రెబ్బలు తినడం ఆరోగ్యానికి మంచి చేస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే.. తినడమే కాదు.. దీనితో చేసే కొన్ని పనులు కూడా మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయట.
వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయం చేస్తాయి. అయితే.. రాత్రిపడుకునే ముందు వెల్లుల్లి రెబ్బలను దిండు కింద పెట్టుకొని పడుకోవాలట. అలా చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పడుకునే ముందు వెల్లుల్లి రెబ్బలను దిండు కింద పెట్టుకొని పడుకుంటే.. దోమలు రాకుండా ఉంటాయట. దోమల బెడద నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
దోమలు వంటి కీటకాలను తరిమికొట్టే టాక్సిన్స్ వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. వెల్లుల్లి నుంచి వచ్చే వాసనకు దోమలు ఇతర కీటకాలు దూరంగా ఉంటాయట.
అంతేకాదు.. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి చక్కని పరిష్కారమట. వెల్లుల్లి రెబ్బలను తలకింద పెట్టుకొని పడుకుంటే హాయిగా నిద్రపడుతుందట. దీనిలో ఉండే విటమిన్ బి1... మంచి నిద్రకు సహకరిస్తాయట.
మనిషికి ఏడు గంటల నిద్ర చాలా అవసరం. అలా నిద్రపోని సమయంలో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఆ నిద్ర సరిపోవాలంటే.. దిండు కింద వెల్లుల్లి పెట్టడం ఉత్తమమైన మార్గం.
వెల్లుల్లి తినడం వల్ల మాత్రమే కాదు.. దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుందట.
ప్రతిరోజూ పెట్టుకోవడం వల్ల కొద్ది కొద్దిగా రోగనిరోధక శక్తి పెరగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుందట.
ఈరోజుల్లో జలుబు కూడా పెద్ద రోగమే. దాని నుంచి బయటపడాలంటే రాత్రిపూట పడుకునే ముందు వెల్లుల్లిని దిండు కింద పెట్టుకోవాలట. అలా చేయడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.