ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చేతిలో డబ్బుంటే సరిపోదు.. మనిషికి ఆరోగ్యం ముఖ్యమని ఈ కరోనా వచ్చాకే అర్థమయ్యింది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి.. ఎలాంటి వైరస్ తోనైనా పోరాడగలిగేలా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
కొందరైతే రకరకాల విటమిన్ ట్యాబెట్లు మింగుతున్నారు. అవేమీ లేకుండా..కేవలం వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకుంటే.. కరోనా ని చాలా సులభంగా ఎదురించవచ్చు. ఆ ఆహారాలేంటో ఓసారి చూద్దాం.. వీటన్నింటినీ..పరగడుపున మాత్రమే తినాలట. అలా తింటేనే రోగనిరోధక శక్తి పెంచుతాయట.
వెల్లుల్లి.. వెల్లుల్లిలో యాంటీ బయోటిక్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి. దీనిని పరగడపున తినడం వల్ల సహజంగానే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అంతేకాదు రక్తంలోని షుగర్ లెవల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. గుండె ఆరోగ్యంగా పనిచేసేందుకు సహకరిస్తుంది. ఉదయాన్నే రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను వేడి నీటిలో మరిగించి.. దానిని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ఉసిరి.. ఉసిరిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తుంది. పరగడపున ఉసిరిని వేడి నీటితో కలిసి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక్తిని పెంచుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరం మృదువుగా మారుతుంది.. జుట్టు కూడా బలంగా మారుతుంది.
తేనె.. గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకొని పరగడుపున తాగడం వల్ల అద్భుతాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గాలని అనుకునేవారికి చక్కగా పనిచేస్తుంది. దీనిలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. రోగనిరోధక్తిని పెంపొందిచడానికి కూడా సహాయం చేస్తుంది.