టేస్టీ టేస్టీ కాకరకాయ-కీమా.. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా?

First Published | May 22, 2021, 5:03 PM IST

కాకరకాయ-కీమా.. దీన్ని ఒక్కసారి రుచి చూశారంటే.. జీవితంలో వదిలిపెట్టరు. కాకరకాయల్ని కోసి మధ్యలో కీమా మిశ్రమాన్ని పెట్టి డీప్ ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అదుర్స్.  దీన్ని చపాతీలోకి, అన్నంలోకి తినొచ్చు. లేదా సాంబార్, పప్పులు లాంటి వాటికి సైడ్ డిష్ గా కూడా తినొచ్చు...

కాకరకాయ-కీమా.. దీన్ని ఒక్కసారి రుచి చూశారంటే.. జీవితంలో వదిలిపెట్టరు. కాకరకాయల్ని కోసి మధ్యలో కీమా మిశ్రమాన్ని పెట్టి డీప్ ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అదుర్స్. దీన్ని చపాతీలోకి, అన్నంలోకి తినొచ్చు. లేదా సాంబార్, పప్పులు లాంటి వాటికి సైడ్ డిష్ గా కూడా తినొచ్చు...
కాకరకాయ-కీమా తయారీకి కావాల్సిన పదార్థాలు...1 కిలో కాకరకాయలు4 పెద్ద ఉల్లిపాయలు1 టీస్పూన్ వెల్లుల్లి పేస్ట్రుచికి తగినంత ఉప్పు12 టీస్పూన్ పసుపు2 ఆకుపచ్చ ఏలకులు2 లవంగాలు2 టీస్పూన్ల ఆచారి మసాలా2 పచ్చిమిర్చిఅవవసరానికి తగినంత రిఫైన్డ్ ఆయిల్

కీమా తయారీకి కావాల్సిన పదార్తాలు...1 12 కిలోల గొర్రె మాంసం...(మెత్తగా కీమా కొట్టించాలి)400 గ్రాముల పెరుగు1 టీస్పూన్ అల్లం పేస్ట్4 టీస్పూన్ల కారం పొడి2 ఏలకులు1 టీస్పూన్ జీలకర్ర10 మిరియాలు1 మామిడికాయ ముక్కఅవసరాన్ని బట్టి పుదీనా ఆకులు
కాకరకాయ-కీమా తయారు చేసే విధానం..ముందుగా ఒక కుక్కర్ స్టౌ మీద పెట్టుకుని నూనె వేడి చేసి, తరిగిన ఉల్లిపాయలను వేసి... 2-3 నిమిషాలు వేగనివ్వాలి. తరువాత దీంట్లో పొడి మసాలాలు, పసుపు, కారం పొడి వేసి కలపాలి.
ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక కీమా వేయాలి. ఇప్పుడు దీన్ని కలిపి కాసేపు అలాగే ఉంచేయాలి. కీమాలో నీళ్లు ఊరి కాస్త ఉడికినట్టు అనిపించాక.. పెరుగు వేసి కలపాలి
నీరంతా ఇగిరిపోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు దీంట్లోకేరళ విత్తనాలు, తురిమిన కైరీ, అచార్ కా మసాలా వేసి బాగా కలిపి... మూత పెట్టి కీమా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
ఇప్పుడు కాకరకాయలను మధ్యకు కోసి లోపలి గింజలు తీసేయాలి. తరువాత ఉడికిన కీమాను బైటికి తీసి.. ఈ కాకరకాయల్లో నింపాలి. ఇవి విచ్చుకుపోకుండా కాకరకాయల్ని తాడుతో ముడి వేయాలి.
తరువాత వాటిని డీప్ ఫ్పై చేయాలి. బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తరువాత వీటిని మళ్లీ కీమా వండిన కుక్కర్లో పెట్టి మరో 5-7 నిమిషాలు ప్రెజర్ కుక్ చేయాలి.
ఇక ఇప్పుడు దీనిమీద తాజా పుదీనా ఆకులు, పచ్చిమిర్చితో గార్నిష్ చేస్తే సరి. దీన్నివేడి వేడి చపాతీలు, లేదా అన్నంతో తినవచ్చు.

Latest Videos

click me!