పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 17, 2024, 11:54 AM IST

చాలా మంది పచ్చి ఉల్లిపాయలను బాగా తింటుంటారు. నిజానికి ఉల్లిపాయలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ పదేపదే పచ్చిఉల్లిపాయల్ని ఎక్కువగా తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదు. 

ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. ఇది వేడి, ఎండల నుంచి రక్షించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహయాపడుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఉల్లిపాయలు కూడా బాగా సహాయపడతాయి. ఉల్లిపాయల్ని బిర్యానిలో, సలాడ్, మజ్జిగ వంటి ఎన్నో ఆహారాల్లో తింటుంటారు. వేడి వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉండటానికి కూడా పచ్చి ఉల్లిపాయల్ని తినమని చాలా మంది సలహాలు కూడా ఇస్తుంటారు. పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇది బాడీ హీట్ ను కూడా తగ్గిస్తుంది. పచ్చి ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. వీటిని ఎక్కువగా తింటే మాత్రం మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. అవును పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమవుతాయి. అలాగే ఎన్నో కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అసలు పచ్చి ఉల్లిపాయల్ని తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Image: Getty Images


అసిడిటీ

ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలను లిమిట్ లో తింటేనే వేడి తగ్గుతుంది. కానీ ఈ సీజన్ లో మీరు ఉల్లిపాయలను ఎక్కువగా తింటే ఎసిడిటీ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి ముడి ఉల్లిపాయల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. అయితే మీకు అవసరమైన దానికంటే ఎక్కువ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ను తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో.. పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. పచ్చి ఉల్లిపాయలు తింటే అజీర్ణం,అసిడిటీ వంటి సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. 
 


డయాబెటిస్

బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే నిర్ణీత మొత్తంలో ఉల్లిపాయలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇలాంటి సమయంలో పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత తగ్గుతాయి. డయాబెటిస్ పేషెంట్లు ఉల్లిపాయలు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను వెంటనే చెక్ చేసుకోండి. 
 

మలబద్ధకం, కడుపు నొప్పి

పచ్చి ఉల్లిపాయల్ని ఎక్కువగా తినడం వల్ల మలబద్దకం, కడుపు నొప్పి కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీటిని ఎక్కువగా తింటే కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. 
 


అలర్జీ, గుండెల్లో మంట

పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల ఏ రకమైన అలర్జీ ఉన్నవారు డాక్టర్ ను అడిగిన తర్వాతే ఉల్లిపాయల్ని తినాలి. ఇలాంటి వారు పచ్చి ఉల్లిపాయల్ని తింటే గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, దురద, వాపు వంటి అలర్జీలు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. 

మైగ్రేన్ 

కొంతమందికి పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల మైగ్రేన్ సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయల్లో టైరామిన్ ఉంటుంది. ఇది తలనొప్పి సమస్యను మరింత పెంచుతుంది. మైగ్రేన్ సమస్య ఉన్నవారు పచ్చి ఉల్లిపాయల్ని తినకపోవడమే మంచిది. 
 

Latest Videos

click me!