ద్రాక్ష పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published May 17, 2024, 10:51 AM IST

ఎండాకాలంలో ద్రాక్షపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది. అయితే ఈ పండ్లు చాలా తొందరగా పాడవుతుంటాయి. ఇలా కాకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Grapes

ద్రాక్ష పండ్లలు మనల్ని ఎన్నో రోగాల బారి నుంచి కాపాడుతాయి. ముఖ్యంగా మండుతున్న ఎండల్లో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అయితే ఈ పండ్లు తొందరగా పాడైపోతుంటాయి. ద్రాక్షపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ద్రాక్ష పండ్లను కొనేటప్పుడు కాండం పండుకు గట్టిగా జతచేయబడి ఉండేలా చూసుకోండి. అలగే జిగటగా, ముడతలు పడిన ద్రాక్ష పండ్లను కొనకండి. 
 

ద్రాక్షపండ్లను చాలా మంది ఎక్కువగాకొనేసి ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ ద్రాక్షపండ్లను కడిగి తుడవకుండా అలాగే ఫ్రిజ్ లో పెడితే తేమ వల్ల అవి త్వరగా కుళ్లిపోతాయి. అందుకే ద్రాక్షపండ్లను కడిగి అలాగే పెట్టకుండా వాటిని బాగా ఆరబెట్టి ఫ్రిజ్ లో పెట్టండి. దీనివల్ల అవి తొందరగా పాడుకావు. 

Latest Videos


ప్లాస్టిక్ సంచులు

ప్లాస్టిక్ కవర్లలో పెడితే కూడా పండ్లు తొందరగా చెడిపోవు. మీరు తెచ్చిన ద్రాక్షలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని ప్లాస్టిక్ సంచులు లేదా కంటైనర్లలో పెట్టండి. వీటివల్ల అవి తొందరగా పాడుకావు. 
 

వీటి దగ్గర పెట్టకూడదు

ద్రాక్ష పండ్లను వేటిదగ్గర పడితే వాటి దగ్గర పెట్టకూడదు. ముఖ్యంగా ఆపిల్, టమాటాలు, వెన్న వంటి ఆహారాల దగ్గర ద్రాక్ష పండ్లను పొరపాటున కూడా పెట్టకూడదు. ఎందుకంటే వాటి నుంచి వెలువడే ఇథిలీన్ ద్రాక్ష పండ్లు త్వరగా కుళ్లిపోయేలా చేస్తుంది.
 

ఏ ద్రాక్షపండు అయినా కొద్ది కొద్దిగా కుళ్లిపోవడం మొదలవుతుంది. కుల్లిపోయిన ద్రాక్షపండ్లను గనుక చూస్తే వెంటనే ఆ పండ్ల నుంచి తీసేయండి. లేకపోతే ఇది ఇతర ద్రాక్ష పండ్లు కుల్లిపోయేలా చేస్తుంది. అందుకే కరాబైన పండ్లను వెంటనే మిగతా పండ్ల నుంచి వేరుచేయండి.

ద్రాక్షపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని గాలి చొరబడని సంచిలో ఉంచండి. అలాగే వీటిని రిఫ్రిజిరేటర్ డ్రాయర్ వెనుక భాగంలో ఉంచండి. అక్కడ అవి చెడిపోకుండా, చల్లగా ఉంటాయి. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. 

click me!