రోజుకి ఎన్ని స్పూన్ల పంచదార తినొచ్చో తెలుసా..?

First Published | May 16, 2024, 4:54 PM IST

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎంత పంచదార మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు  తెలుసుకుందాం..

sugar

ఉదయం  లేచిన దగ్గర నుంచి మనం టీ, కాఫీ వంటి వాటి కోసం పంచదార వాడుతూనే ఉంటాం. తెలీకుండానే మన  శరీరంలోకి షుగర్ చేరిపోతూ ఉంటుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే పంచదార మన డైట్ లో భాగం అయిపోయిందని చెప్పొచ్చు.  టీ దగ్గర నుంచి మిల్క్ షేక్, కేక్స్, స్వీట్స్, ఇలా ఏది చేయాలన్నా షుగర్ ఉండాల్సిందే.  తెలీకుండానే మనం ఎక్కువ షుగర్ తీసుకుంటున్నాం అనే చెప్పొచ్చు.

పంచదార ఆరోగ్యానికి మంచిది కాదు అని, దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అని మనకు తెలుసు. మరి..  ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎంత పంచదార మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు  తెలుసుకుందాం..
 


ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సంయుక్తంగా భారతీయుల కోసం ఒక కొత్త డైటరీ గైడ్‌ను విడుదల చేశాయి. దీని ప్రకారం, చక్కెర తీసుకోవడం, ఉప్పు తీసుకోవడం, నూనె తీసుకోవడం తగ్గించాలని సూచించారు.


పంచదార, ఉప్పు  కలిగిన ప్రాసెస్ చేసిన ఆహారాల అధిక వినియోగం , నిశ్చల జీవనశైలి భారతీయులలో సూక్ష్మపోషకాల లోపానికి దారి తీస్తుంది. అధిక బరువు పెరగడానికి కూడా కారణమౌతుందట. జీవనశైలిలో వ్యాయామం వంటి శారీరక శ్రమను చేర్చాలని , చక్కెర , అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలని కూడా సలహా ఇస్తారు.

అంతేకాకుండా.. ఒక మనిషి రోజుకి 20 నుంచి 25 గ్రాముల చక్కెర మాత్రమే తీసుకోవాలని వారు చెప్పారు. ఎందుకంటే.. వైట్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల...  గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ (G6P) పెరుగుదలకు దారితీస్తుంది, ఇది గుండె కండరాల ప్రోటీన్  మార్పిడికి ప్రధానంగా బాధ్యత వహిస్తుంది

ఇది గుండె వైఫల్యానికి దారితీస్తుంది. శరీరంలో ఎండార్ఫిన్‌ల విడుదలను పెంచడం వల్ల తెల్ల చక్కెర శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అందుకే... వైట్ చెక్కర తీసుకునే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది. 
 

Latest Videos

click me!