నెల రోజులు కాఫీ తాగడం మానేస్తే ఏమౌతుంది..?

First Published | May 14, 2024, 2:57 PM IST

 కాఫీ అలవాటు ఉన్నవారు.. నెల రోజుల పాటు కాఫీ తాగడం మానేస్తే ఏమౌతుందో ఓసారి చూద్దాం...
 

భారతీయులకు ఉదయం లేవగానే.. వేడి వేడిగా టీ, కాఫీలు పడాల్సిందే. ఆ రెండూ లేకుండా...చాలా మందికి అసలు రోజు మొదలుకాదు. అవి తాగకపోతే... వారికి విపరీతమైన తలనొప్పి, నీరసం లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అయితే... కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కొందరు కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని కొందరు అంటే.. కొందరు అస్సలు మంచిది కాదు అని వాదించేవారు కూడా ఉన్నారు. 

ముఖ్యంగా గర్భిణీలు, గుండె సమస్యలు ఉన్నవారు కాఫీలు తాగడం మంచిది కాదు అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అసల.. కాఫీ అలవాటు ఉన్నవారు.. నెల రోజుల పాటు కాఫీ తాగడం మానేస్తే ఏమౌతుందో ఓసారి చూద్దాం...
 



మీరు ఒక నెల పాటు కాఫీ తాగడం మానేస్తే, కెఫీన్ లేకపోవడం వల్ల తలనొప్పి, అలసట లాంటివి వస్తాయి. చిరాకు , ఏకాగ్రత కష్టంగా ఉంటుంది. ఇవి మొదటి రెండు, మూడు రోజులు మాత్రమే కనపడతాయి. చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ.. ఈ లక్షణాలు ఇబ్బంది పెడుతున్నా కూడా..  కాఫీకి దూరంగా ఉంటే.. అవి కూడా తగ్గిపోతాయి.  నిజానికి,  కెఫీన్ మీ నిద్ర నాణ్యతకు ఆటంకం కలిగిస్తుంది. కాఫీ తాగడం ఆపేస్తే.. నిద్ర సమస్యలు ఉండవు.

ఒక నెల పాటు కాఫీని మానేయడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది, శక్తి కోసం కెఫిన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కాపీ తాగడం వల్ల మన శరీరం డీహైడ్రెట్ డ్ గా మారుుతంది. అదే కాఫీ మానేస్తే.. డీ హైడ్రేషన్ సమస్య ఉండదు.

కాఫీ కొందరిలో జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాఫీని మానేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా అజీర్ణం సమస్యలను తగ్గించుకోవచ్చు. కాఫీకి బదులుగా కెఫిన్ లేని పానీయాలు మంచి ఆర్ద్రీకరణకు దోహదం చేస్తాయి, ఇది మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనది.
 

కాఫీ తాగడం మానేయడం నేరుగా బరువు తగ్గడానికి దారితీయనప్పటికీ, చక్కెర, క్రీమ్ వంటి అధిక కేలరీల కాఫీ సంకలితాలను తొలగించడం వల్ల కేలరీల తీసుకోవడం తగ్గించవచ్చు, ఇది బరువు నిర్వహణకు దోహదం చేస్తుంది. కాబట్టి..నెల రోజులు కాఫీకి దూరంగా ఉంటే... ఈ లాభాలు అన్నీ మీరు చూడొచ్చు.

Latest Videos

click me!