అప్పడాలు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 18, 2024, 11:25 AM IST

అప్పడాలను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ  ఇష్టపడతారు. చాలా మంది వీటిని భోజనంలో ఒక్కటైనా తింటుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? అన్న ముచ్చట తెలుసా? 

అప్పడాలు కరకరలాడుతూ బలే టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. మధ్యహ్నం, రాత్రి భోజనంలో వీటిని పక్కాగా తినేవారు చాలా మందే ఉన్నారు. రెండు అప్పడాలను తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. 

అప్పడాలను రసం అన్నం, సాంబార్ రైస్ , దాల్ రైస్ లో బాగా తింటారు. రెసిపీని బట్టి ఎన్నో రకాల ఆకారాల్లో ఉంటాయి. ఎండలో ఎండబెట్టి తయారుచేసిన ఈ అప్పడాల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని నూనెలో వేయించి తింటాం. కాబట్టి ఇవి మన ఆరకోగ్యానికి మంచి చేస్తాయా?చెడు చేస్తాయా? అన్న ముచ్చటను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 



ఉప్పు

అన్ని రకాల అప్పడాల్లో ఉప్పు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అప్పడాలు ఉప్పతోనే రుచిగా మారుతాయి. అందులోనూ ఇండియా వంటకాల్లో మసాలా దినుసులు, ఉప్పు ఖచ్చితంగా ఉంటాయి. కానీ మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పును వాడితే మాత్రం మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.

దీనివల్ల రక్తంలో ఉప్పు లెవెల్స్ పెరుగుతాయి. ఉప్పడాల్లో ఎక్కువగా ఉండే ఉప్పు అధిక రక్తపోటు, డయాబెటీస్, శరీరంలో నీటి నిలుపుదల, బాగా దాహం కావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. 
 

కొన్ని అప్పడాలు మంచివి కావు

అప్పడాలను ఎప్పుడైనా ఒకసారి తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ మీరు ప్రతిరోజూ అప్పడాలను తింటే మాత్రం ఖచ్చితంగా జబ్బు బారిన పడతారు. కొన్ని రకాల అప్పడాలను రెగ్యులర్ గా తింటే ఎసిడిటీతో పాటుగా చాలా రకాల జీర్ణ సమస్యలు వస్తాయి. కొంతమంది ఒక్కసారే నాలుగైదు అప్పడాలను తింటారు. కానీ ఇలా తింటే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

మలబద్దకం

అప్పడాలను మోతాదులో తింటే వచ్చే సమస్యలు చాలా తక్కువ. కానీ మీరు ఎక్కువగా తింటే మాత్రం జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎందుకంటే అప్పడాల పిండి మీ కడుపునకు అంటుకుంటుంది. దీనివల్ల గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. 

నూనె నాణ్యత

బయటకొనే అప్పడాలు ఆరోగ్యానికి మంచివి కాకపోవచ్చు. ఎందుకంటే వాడిన నూనెలోనే ప్రతిరోజూ అప్పడాలను వేయిస్తుంటారు. దీనివల్ల మీ శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్ పెరుగుతుంది.  నాణ్యత లేని నూనెల వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. మీకు తెలుసా? మార్కెట్ లో దొరికే అప్పడాలు క్వాలిటీ ఉండవు. వీటిని తింటే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి సమస్యలు వస్తాయి. 

Latest Videos

click me!