వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే అజీర్ణం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. టీ అలవాటు ఉన్నవారు.. టీ వినియోగానికి దూరంగా ఉంటే గుండెల్లో మంట, తల తిరగడం, గుండె వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు తగ్గుతాయి.
టీ తాగిన తర్వాత బాగా నిద్రపోవచ్చు. విరేచనాలు, వాంతులు లేదా చెడు అపానవాయువు/ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. వీటన్నింటితో పాటు బరువు తగ్గడం మొదలవుతుంది. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు.