రోజూ ఒక అరటిపండును తినాలని ఎందుకు చెప్తారు?

First Published Jun 15, 2024, 4:52 PM IST

అరటిపండులో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు రోజూ  ఒక అరటిపండును తినాలని చెప్తుంటారు. ఇలా ఎందుకు చెప్తారో తెలుసా? 
 

రోజూ ఒక ఆపిల్ పండును తింటే రోగాలు దరిచేరవనే మాటను వినే ఉంటారు. ఆపిల్ నే కాదు రోజూ ఒక అరటిపండును తిన్నా మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అందుకే కదా డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు రోజూ ఒక అరటిపండును తినాలని సలహానిస్తుంటారు. అసలు రోజూ ఒక అరటిపండును తింటే మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

అరటిపండు ప్రీబయోటిక్స్ కు మంచి మూలం. దీనిలో ఉండే ఈ ప్రీబయోటిక్స్ మన గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి మన గట్ లో ఇప్పటికే ఉన్న మంచి బ్యాక్టీరియా మరింత పెరిగేలాచేసత్ాయి. దీంతో మన జీర్ణవ్యవస్థ రిపేర్ అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

అరటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన కండరాలను, నరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కండరాల తిమ్మిరిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అరటిపండులో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇది బీపీ పేషెంట్లకు బాగా సహాయపడుతుంది. అరటిపండును తింటే అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే దీనిలో ఉండే పొటాషియం నరాల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా అరటి మంచి మేలు చేస్తుంది. 

అయితే అరటి పండ్లను తింటే బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు. అందుకే దీన్ని తినకుండా ఉంటారు కొంతమంది. కానీ ఇలా కానేకాదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి అరటిపండ్లు ఫైబర్ కు మంచి మూలం. వీటిని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అరటి పండు మంచి శక్తి వనరు. దీన్ని తింటే మీకు వెంటనే శక్తి లభిస్తుంది. 

Latest Videos

click me!