ఒక నెల పాటు కిస్ మిస్ లను ఉదయాన్నే తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 29, 2024, 1:44 PM IST

కిస్ మిస్ లు తీయగా, టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని రెగ్యులర్ గాతింటుంటారు. అయితే మీరు ఒక నెల పాటు వీటిని పరిగడుపున తింటే ఏం జరుగుతుందో తెలుసా? 
 

Dry Raisins

ఎండుద్రాక్షలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కేలరీలు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ,విటమిన్ కె, విటమిన్ బి 6, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు  పుష్కలంగా ఉంటాయి. మీరు వీటిని ఒక నెల పాటు పరిగడుపున తిన్నట్టైతే ఎన్నో లాభాలను పొందుతారు. అవేంటంటే? 
 

మెరగైన జీర్ణక్రియ

ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. కిస్ మిస్ లోని ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడానికి, మలబద్ధకం నుంచి  ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. మీరు కంటిన్యూగా వీటిని నెలపాటు  పరిగడుపున తింటే మీకు ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. 
 


raisins

నియంత్రణలో రక్తపోటు

ఎండుద్రాక్షల్లో పొటాషియం కూడా మెండుగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. మీకు బీపీ సమస్య ఉంటే వీటిని ఒక నెల పాటు తినండి. ఇది మీ బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. 
 

గుండె ఆరోగ్యం

కిస్ మిస్ లల్లో యాంటీ ఆక్సిడెంట్లు  ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి బాగా సహాయపడతాయి. వీటిని తింటే మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. 

రక్తహీనతను నివారిస్తుంది.

కిస్ మిస్ లల్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఒంట్లో రక్తం తగ్గుతుంది. ఇది విపరీతమైన అలసట. బలహీనతలను కలిగిస్తుంది. 

బలమైన ఎముకలు 

ఎండుద్రాక్షల్లో మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే ఇవి  బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడతాయి.

చర్మానికి మేలు 

ఎండుద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ ఇ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన జుట్టుకు, చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్-సి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 


బరువు తగ్గడానికి

ఎండుద్రాక్షలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. అంటే వీటిని తింటే మీరు సులువుగా బరువు కూడా తగ్గుతారు. దీనిలోని ఫైబర్ కంటెంట్ మీ కడుపును తొందరగా నింపుతుంది. దీంతో మీరు హెవీగా తినలేరు. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 

Latest Videos

click me!