నాన్ వెజ్ వండిన తర్వాత పాత్రల వాసన వస్తున్నాయా? ఈ చిట్కా మీ కోసమే

First Published | Aug 28, 2024, 1:46 PM IST

వంట అయిపోయిన తర్వాతే అసలు సమస్య. ఎంత శుభ్రం చేసినా.. ఆ పాత్రల నుంచి నీచు వాసన తొందరగా వదలదు. 

bad odour

నాన్ వెజ్ ప్రియులకు రోజూ.. చికెన్, మటన్, ఫిష్ వండి పెట్టినా హ్యాపీగా లాగించేస్తారు. తినేటప్పుడు, వండేటప్పుడు కూడా బాగానే ఉంటుంది. కానీ.. వంట అయిపోయిన తర్వాతే అసలు సమస్య. ఎంత శుభ్రం చేసినా.. ఆ పాత్రల నుంచి నీచు వాసన తొందరగా వదలదు. ఆ పాత్రల్లో ఇంకేదైనా వండాలంటే కూడా అంత మంచిగా అనిపించదు. అయితే.. ఈ వాసన పోవాలంటే... ఈ కింది చిట్కాలు ఫాలో అయితేచాలు.. అవేంటో ఓసారి చూద్దాం..

1.లెమన్..
నిమ్మకాయను ఉపయోగించి మనం ఈ పాత్రల వాసనను ఈజీగా పొగొట్టేయవచ్చట. నిమ్మకాయలో ఉండే... ఎసిడిక్ కంటెంట్ కారణంగా.. ఎలాంటి వాసన అయినా సులభంగా పోతుంది. మీరు మాంసం వండిన పాత్రలను నీటితో నింపి, దాంటో నిమ్మరసం పిండితే సరిపోతుంది. కాసేపు అలానే ఉంచి, ఆ తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది.

Latest Videos


2.వెనిగర్..
నిమ్మకాయ తర్వాత.. అంత ఎఫెక్టివ్ గా పని చేసేది వెనిగర్ మాత్రమే. ఇది కూడా ఎలాంటి వాసన అయినా  ఈజీగా పోగొట్టకలదు. కేవలం నీటిలో కలిపి.. ఆ పాత్రల్లో పోస్తే సరిపోతుంది. కాసేపటి తర్వాత శుభ్రం చేస్తే.. ఆ వాసన మొత్తం పోతుంది.

3.బేకింగ్ సోడా..
బేకింగ్ సోడా దాదాపు అందరి ఇంట్లో ఈజీగా దొరికేస్తుంది. దాంతో కూడా ఈజీగా దుర్వాసన పోగొట్టొచ్చు. ఒకటి లేదంటే రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ తీసుకొని.. దానిని నీటిలో కలిపి.. ఆ తర్వాత నాన్ వెజ్ వండిన పాత్రల్లో  వేస్తే సరిపోతుంది. కాసేపటి తర్వాత... మళ్లీ ఆ పాత్రలను కడిగాలి.

4.శెనగ పిండి..
శెనగ పిండిలో... ఎలాంటి వాసనను అయినా పీల్చేసే ప్రాపర్టీలు ఉంటాయి.  అందుకే.. నాన్ వెజ్ వండిన పాత్రల్లో శెనగ పిండి వేసి చల్లాలి. ఆ తర్వాత.. శుభ్రంగా రుద్ది.. మళ్లీ కడుక్కుంటే సరిపోతుంది.
 

5.కాఫీ పొడి..
కాఫీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది. ఇది.. ఎలాంటి వాసనను అయినా వదిలించేస్తుంది.  ఈ కాఫీ పొడి నీటిలో కలిపి.. నాన్ వెజ్ వండిన పాత్రల్లో పోస్తే సరిపోతుంది. ఆ వాసన వదులుతుంది.
 

click me!