నిద్రలో మంచినీళ్లు తాగుతున్నారా..? ఇది మంచిదేనా..?

First Published | Aug 9, 2024, 1:58 PM IST

పడుకునే ముందు మంచం దగ్గరలో వాటర్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ.. ఇలా నిద్రలో మంచి నీళ్లు తాగడం అసలు మంచిదేనా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...
 

Hydrate

మంచి నీళ్లు.. మన దాహాన్ని తీరుస్తాయి. రోజంతా ఆహారం తీసుకోకుండా అయినా ఉండగలం కానీ.. మంచి నీళ్లు తాగకుండా మాత్రం ఉండటం కష్టం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు తాగడం చాలా అవసరం. అయితే.. రాత్రిపూట అది కూడా.. నిద్ర మధ్యలో లేచి మంచి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

దాదాపు మనలో చాలా మంది రాత్రి పడుకునే ముందు.. బెడ్ దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకొని మరీ పడుకుంటారు. మధ్యలో మెళకువ వచ్చినప్పుడు వాటర్ తాగాల్సి వస్తే కిచెన్ దాకా వెళ్లడం ఎందుకని ముందే జాగ్రత్తగా వాటర్ బాటిల్ పెట్టుకుంటారు. ఇప్పుడనే కాదు.. పూర్వం నుంచి ఈ అలవాటు ఉంది. పడుకునే ముందు మంచం దగ్గరలో వాటర్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ.. ఇలా నిద్రలో మంచి నీళ్లు తాగడం అసలు మంచిదేనా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...


సాధారణంగా మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో అయితే మరీ ఎక్కువగా తాగాలి. వాటర్ తాగడం వల్ల.. చాలా రకాల జబ్బులు  రాకుండా దూరంగా ఉంచుతుంది. మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. రోజు మొత్తంలో మనం రెగ్యులర్ గా వాటర్ తాగుతూనే ఉండాలి. కానీ.. ఏ టైంలో పడితే ఆ టైమ్ లో తాగడం మాత్రం అంత మంచిది కాదట.

రాత్రి పడుకునేముందు మరీ ఎక్కువ మంచినీళ్లు తాగకూడదట. మరీ దాహంగా అనిపిస్తే.. కాస్త నోరు తడుపుకోవాలి కానీ...  మరీ ఎక్కువగా తాగకూడదట. నిద్ర మధ్యలో లేచి కూడా ఎక్కువ నీళ్లు తాగకూడదట. దీని వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
 

drinking water

పడుకునే సమయంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల  శరీరంలో టెంపరేచర్  లెవల్స్  పడిపోతాయట. దీని వల్ల చాలా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉందట. అందుకే.. మరీ ఎక్కువ నీరు తాగకూడదట.
 

అంతేకాదు.. రాత్రి సమయంలో  ఎక్కువ నీరు తాగడం వల్ల.. యూరిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఊరికూరికే మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు. దీని వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. 

నిద్ర మధ్యలో లేచి పొట్ట నిండేలాగా నీళ్లు తాగితే.. చాలా వరకు నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ఒత్తిడి లాంటి సమస్యలు, అలసిపోయినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. రక్త ప్రసరణ కూడా జరిగా జరగక ఇబ్బంది కలుగుతుంది.

Latest Videos

click me!