ఎవరెవరు టమాటాలను తినకూడదో తెలుసా?

First Published | Aug 9, 2024, 11:57 AM IST

టమాటాలు లేని కూర ఉండనే ఉండదు. టమాటాలతోనే కూరల్లో మంచి గ్రేవీ ఉంటుంది. కానీ టమాటాలను కొంతమంది పొరపాటున కూడా తినకూడదు. వాళ్లు ఎవరెవరంటే?
 

మనం టమాటాలను ప్రతి ఒక్క కూరలో ఉపయోగిస్తుంటాం. అందుకే ప్రతి వంటగదిలో ఏవి ఉన్నా లేకున్నా టమాటాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. నిజానికి టమాటాలు కూరలను చాలా టేస్టీగా చేస్తాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, కాల్షియం, విటమిన్-సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. టమాటాలు ఆరోగ్యానికి ఎంత మంచి చేసినా.. కొంతమంది మాత్రం వీటిని అస్సలు తినకూడదు. వాళ్లు ఎవరెవరంటే? 

కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే.. 

ప్రస్తుత కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మూత్రపిండాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా.. మీరు మాత్రం టమాటాలను మర్చిపోయి కూడా తినకూడదు.  ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు టమాటాలను పూర్తిగా మానేయాలి.  ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా తినడం మానేయాలి. టమాటాల్లో కాల్షియం ఆక్సలేట్  ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ ను మరింత పెంచుతుంది. 
 



కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా టమాటాలను తినడం మానేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లు టమాటాలను తింటే కీళ్ల నొప్పుల అసౌకర్యం పెరుగుతుంది. అలాగే కీళ్ల వాపు కూడా ఎక్కువ అవుతుంది. 
 


విరేచనాలు 

డయేరియా సమస్య ఉంటే కూడా మీరు టమాటాలను తినకూడదు. నిజానికి టమాటాల్లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది విరేచనాలను మరింత పెంచుతుంది. అందుకే ఈసమస్యతో బాధపడేవారు టమాటాలను తినకూడదని డాక్టర్లు చెప్తారు. 


గ్యాస్ ఉన్నప్పుడు.. 

టమాటాల్లో  ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ గ్యాస్ సమస్యను మరింత పెంచుతాయి. కాబట్టి గుండెల్లో మంట, అసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు వీటిని అస్సలు తినకండి. ఎందుకంటే టమాటాలు మీ సమస్యలను మరింత పెంచుతాయి. 
 

tomato


చర్మ అలెర్జీలు 

చర్మ సమస్యలు, అలర్జీలు ఉన్నప్పుడు పొరపాటున కూడా టమాటాలను తినకూడదు. ఇలాంటి సమస్య వచ్చిన తర్వాత టమాటాలను తింటే అలర్జీ వేగంగా పెరిగి చర్మంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి.
 

Tomatoes

వాపు 

ఇన్ఫ్లమేషన్ సమస్య ఉన్నా కూడా మీరు టమాటాలు పొరపాటున కూడా తినకూడదు. నిజానికి టమాటాలను ఇన్ఫ్లమేషన్ లో తినడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.
 

tomatoes

గుండెల్లో మంట 

టమాటాలు తినడం వల్ల చాలా మందికి గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తుంటాయి. మీకు కూడా ఇలా అయితే టమాటాలను తినకండి. 

జాగ్రత్త

టమాటాలు మన ఆరోగ్యానికి ఎంత మంచి చేసినా వీటిని మోతాదులోనే తినాలి. రాత్రిపూట వీటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే మూలకాలు శరీరంలో ఆమ్ల స్థాయిని పెంచుతాయి.

Latest Videos

click me!