పచ్చి మిరపకాయలు ఎక్కువగా తింటున్నారా? అయితే మీ పని అంతే.. !

First Published | Aug 8, 2024, 3:08 PM IST

పచ్చిమిరపకాయలతో చేసిన ఎలాంటి వంటకమైన టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది ప్రతి కూరలో పచ్చిమిరపకాయలు వేస్తుంటారు. కానీ పచ్చిమిరపకాయలను ఎక్కువగా అస్సలు తినకూడదు. ఎందుకంటే?

పచ్చిమిరపకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనేది నిజం. కాకపోతే వీటిని మోతాదులోనే తినాలి. వీటిని అతిగా తింటే మీకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో ఉండే క్యాప్సైసిన్ కడుపులో వేడిని పెంచి ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పచ్చి మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్యసమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

జీర్ణ సమస్యలు

పచ్చిమిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల మీకు జీర్ణ సమస్యలు వస్తాయి. వీటిని రోజూ, ఎక్కువగా తింటే గ్యాస్, ఎసిడిటీ, నొప్పి, చికాకు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. 
 

Latest Videos



నోటి పుండ్లు

పచ్చి మిరపకాయలను  ఎక్కువగా తింటే కడుపులో వేడి పెరుగుతుంది. అలాగే వీటిని అతిగా తినడం వల్ల నోటి పూతల లేదా నోటి పుండ్ల సమస్య కూడా వస్తుంది. 
 

Image: Freepik

చిత్తవైకల్యం

చైనాకు చెందిన న్యూట్రియంట్స్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. మీరు రోజూ 50 గ్రాముల కంటే ఎక్కువ పచ్చిమిరపకాయలను తినడం వల్ల చిత్తవైకల్యం సమస్య వస్తుంది.
 


టాక్సిన్స్ పెరగొచ్చు

పచ్చి మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.


ఆహార సున్నితత్వం

మీరు ప్రతిరోజూ పచ్చి మిరపకాయలను ఎక్కువగా తింటున్నట్టైతే మీకు ఆహార సున్నితత్వం కూడా కలగొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

హార్ట్ రిస్క్

పచ్చిమిర్చిని ఎక్కువగా తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తపోటును పెంచుతుంది. మీకు  ఇదివరకే గుండకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టైతే మీరు పచ్చిమిరపకాయను ఎక్కువగా తినకండి. 

మూత్రపిండాల సమస్యలు 

 పచ్చిమిర్చిని ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం ప్రభావితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మూత్రపిండాల్లో రాళ్లు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది.
 

click me!