నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. దీని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నెయ్యిలో మన ఆరోగ్యానికి అవసరం అయ్యే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అంతేకాదు.. విటమిన్స్, మినరల్స్ కూడా నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే.. రెగ్యులర్ గా నెయ్యి తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణంగా నెయ్యి ని మనం.... రైస్, భోజనం, కూరగాయలు, రోటీలలో జత చేసుకొని తింటాం. కానీ... ఇదే నెయ్యిని ఎప్పుడైనా హాట్ వాటర్ లో కలిపి ఎప్పుడైనా తీసుకున్నారా..? అసలు.. అలా ఉదయాన్నే వేడి నీటిలో నెయ్యి వేసుకొని , ఆ వాటర్ తాగి చూడండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. మీ శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఓసారి చూద్దాం..