చియాసీడ్స్ ని ఇలా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా..?

First Published Jul 27, 2024, 10:03 AM IST

 కేవలం బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రమే  వాటిని తీసుకోవాలి అనుకుంటారు. కానీ... చియా సీడ్స్ ని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే.. ఆరోగ్యకరమైన ఆహారం మన డైట్ లో భాగం చేసుకోవాల్సిందే. అలా ప్రతి ఒక్కరూ తమ డైట్ లో భాగం చేసుకోవాల్సనవి చియా సీడ్స్. చాలా మందికి ఈ చియా సీడ్స్ విషయంలో చాలా అపోహలు ఉంటాయి. కేవలం బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రమే  వాటిని తీసుకోవాలి అనుకుంటారు. కానీ... చియా సీడ్స్ ని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
 

అంతేకాదు  చియా సీడ్స్ ని ఎలా తీసుకోవాలి అనే విషయం కూడా తెలిసి ఉండాలి. కొందరు వీటిని నార్మల్ వాటర్ లో కలిపి లేదంటే.. ఇంకేదైనా స్మూతీలలో కలిపి తీసుకుంటూ ఉంటారు. అలా కూడా తీసుకోవచ్చు. కానీ... లెమన్ వాటర్ లో కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపుగా ఉంటాయి. అవేంటో చూద్దాం...
 

Latest Videos


ఉదయాన్నే  చాలా మందికి లెమన్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. వాటితో పాటు.. అందులో ఒక స్పూన్ చియా సీడ్స్ కలిపితే సరిపోతుంది. ఇలా వీటిని కలిపి తీసుకోవడం వల్ల.. మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. మనం ఎదుర్కొంటున్న చాలా రకాల సమస్యలను కూడా ఈ చియా సీడ్స్ తగ్గించేస్తాయి. సాధారణంగా నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చియా సీడ్స్ తో ని వీటికి అదనంగా చేర్చడం వల్ల.. ఎక్కువ లాభాలు పొందచ్చు.

ఎవరికైనా తిన్న ఆహారం అరగకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్య లాంటివి ఉంటే.. అలాంటివారు ఈ చియాసీడ్స్ ని లెమన్ వాటర్ తో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల... వారికి ఉన్న జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది.
 

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా చియా సీడ్స్ ని ఫుడ్ లో భాగం చేసుకోవాలి. ఇవి గుండె పనితీరును మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తాయి.
 

అంతేకాదు.. లెమన్ వాటర్ తో చియా సీడ్స్ ని తీసుకోవడం వల్ల.. మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. మన బాడీని డీటాక్సిఫై చేయడానికి కూడా సహాయపడుతుంది. బాడీలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లేలా చేస్తాయి.

ఇక.. ముఖ్యంగా చియా సీడ్స్ ని అందరూ తీసుకోవాలి అనుకునే కారణం బరువు తగ్గడం. ఈ విషయంలోనూ ఈ చియా సీడ్స్ సమర్థవంతంగా పని చేస్తాయి. ప్రతిరోజూ పరగడుపున ఈ చియా సీడ్స్ ని లెమన్ వాటర్ తో కలిపి తీసుకుంటే.. కచ్చితంగా బరువు తగ్గుతారు. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలిస్ట్రాల్ ని ఈజీగా కరిగించడంలోనూ సహాయపడతాయి.

ఇవి మాత్రమే కాదు...  చర్మం ఆరోగ్యంగా, అందంగా మారడానికి కూడా ఇవి బాగా సహాయపడతాయి. చియాసీడ్స్ ని రెగ్యులర్ గా తినేవారి చర్మం చాలా గ్లోయిగా ఉంటుంది. 

click me!