లవంగం టీ తాగితే ఆరోగ్యానికి అంత మంచిదా..?

First Published | Jul 13, 2024, 1:06 PM IST

ప్రతిరోజూ ఉదయం పరగడుపున లవంగం టీ తాగితే.... ఊహించని చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అసలు వారికి టీ తాగనిది రోజు మొదలుకాదు. అయితే.. నార్మల్ టీ తాగడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, టీ తాగడం మంచిది కాదు అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ.. అదే టీలో మనం కేవలం రెండు, మూడు లవంగాలు చేర్చడం వల్ల.. దానిని చాలా హెల్దీగా మార్చుకోవచ్చని మీకు తెలుసా?

clove tea

ప్రతిరోజూ ఉదయం పరగడుపున లవంగం టీ తాగితే.... ఊహించని చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

Latest Videos


clove tea

లవంగాలలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రో బాయిల్, యాంటీ వైరల్ ఎనలెజెసిక్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.టీలో లవంగాలను మరిగించడం లేదంటే.. నీటిలో లవంగాలను వేసి మరిగించడం వల్ల ఈ టీని తాగొచ్చు.

clove tea

ఈ టీ తాగడం వల్ల.. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ లవంగం టీ బాగా ఉపయోగపడుతుంది.

clove tea

ఈ సీజన్ లో మనకు మాట్లాడితే తుమ్ములు, దగ్గులు లాంటివి వస్తూ ఉంటాయి. అదే.. ఈ లవంగం టీని పరగడుపున తాగడం అలవాటు చేసుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

clove tea

మీలో ఎవరైనా సైనస్ వంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే.. ఈ లవంగం టీ తాగడం అలవాటు చేసుకోవడం చాలా అవసరం. ఈ టీ చాలా తక్కువ సమయంలో.. మీకు సైనస్ సమస్య నుంచి బయటపడేస్తుంది.

clove tea

అంతేకాదు.. లవంగం టీ తాగడం వల్ల.. మీకు ఉన్న డైజెషన్ సమస్య కూడా తగ్గుతుంది.  పరగడుపున ఈ లవంగం టీ తాగితే... జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. అంతేకాదు.. షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ లవంగం టీ తాగడం వల్ల.. నోటి దుర్వాసన సమస్య అనేది ఉండదు. 

click me!