పెసర పప్పు తింటే బరువు తగ్గుతారా?

First Published | Aug 16, 2024, 3:09 PM IST

బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పెసర పప్పును తిన్నా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

వారానికి ఒకసారైనా పెసరపప్పును తింటుంటారు. ఈ పెసర పప్పుతో చేసిన కూరలు టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది ఈ పప్పును ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ పప్పు మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇది మన శరీరానికి ఓ వరం కంటే తక్కువేమీ కాదు. ముఖ్యంగా పచ్చి పెసర పప్పు. దీనిలో ప్రోటీన్లు, న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. మీకు తెలుసా? దీన్ని డైట్ లో చేర్చుకుంటే బరువు కూడా తగ్గుతారు. అదెలాగో ఓ లుక్కేద్దాం పదండి. 
 

పెసర పప్పు లక్షణాలు

పెసర పప్పులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. పెసరపప్పును ఉడికించి తింటే మీరు  ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఈ పప్పులో ఎలాంటి ఫ్యాట్ ఉండదు. కాబట్టి దీన్ని తిన్నా మీరు బరువు పెరగరు. 
 


వెయిట్ లాస్ 

పెసరపప్పును తింటే మీ మెటబాలిజం మెరుగుపడుతుంది. అలాగే పెసర పప్పు మీకు ఆకలి ఎక్కువగా కానీయదు. దీంతో మీరు తక్కువగా తింటారు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. దీన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితాలను చూస్తారు. 

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది 

పెసరపప్పును తింటే కూడా శరీరంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అంతేకాదు ఈ పప్పు రక్తపోటును నియంత్రించడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఈ పప్పును తింటే మీ శరీరానికి అవసరమైన శక్తి కూడా అందుతుంది. 

రక్తంలో చక్కెర నియంత్రణ

పెసరపప్పులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే మీ బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ పప్పు మన శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

మెరుగైన జీర్ణక్రియ

పెసరపప్పును తింటే ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే లక్షణాలు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే తిన్న ఆహారం బాగా జీర్ణం అయ్యేందుకు కూడా సహాయపడుతుంది.

పెసర పప్పును ఆహారంలో ఎలా చేర్చాలి? 

పెసరపప్పును మీరు రోజువారి ఆహారంలో ఎన్నో విధాలుగా చేర్చొచ్చు. మీరు దీన్ని సూప్, సలాడ్, చిల్లా, డెజర్ట్ గా కూడా ఉపయోగించొచ్చు. దీన్ని ఉడకబెట్టి లేదా మొలకలుగా, పప్పు కూరగా తినొచ్చు. అయితే పెసరపప్పును సరిగ్గా ఉడికించకపోతే సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వికారం, విరేచనాలు, మైకం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు సమస్యలకు దారితీస్తుంది. 

Latest Videos

click me!