రోజూ ఉడకబెట్టిన గుడ్డును తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | May 21, 2024, 1:24 PM IST

గుడ్డులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి బయటపడేస్తాయి. అందుకే చాలా మంది వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. గుడ్లను రెగ్యులర్ గా తింటే ఏమౌతుందో తెలుసా? 


గుడ్లు సంపూర్ణ ఆహారం. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. గుడ్లను తింటే మనం ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటాం. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అందుకే దీన్ని రోజూ తింటుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉడకబెట్టిన గుడ్డును రోజూ తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

కంటి ఆరోగ్యం

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. దీనివల్ల కంటిపై ఒత్తిడి పడి కంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే కంటి చూపు కూడా తగ్గుతుంది. అయితే రోజూ  ఒక ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్డులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Latest Videos


మెదడు ఆరోగ్యం

మెదడు ఆరోగ్యానికి కూడా గుడ్లు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. గుడ్డులో మెదడును ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

శక్తి

ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్లను తింటే  మీరు ఎనర్జిటిక్ గా ఉండేందుకు అవసరమైన కేలరీలు అందుతాయి. గుడ్డు మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి. అలాగే ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. 

గుండె ఆరోగ్యం

ప్రస్తుత కాలంలో చిన్నలు, పెద్దలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ ఒక గుడ్డు తినేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. 

ఎముకల ఆరోగ్యం

గుడ్లు ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. గుడ్డులోని పచ్చసొనలోని విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముకలను, దంతాలను బలంగా చేస్తుంది. ఎముకలు, దంతాల సమస్యల ప్రమాదాలను తగ్గిస్తాయి.
 

మానసిక ఆరోగ్యం

గుడ్డు శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్డులో ఉండే విటమిన్ బి2, విటమిన్ బి12, ఐరన్, ట్రిప్టోఫాన్, కోలిన్ లు డిప్రెషన్ ను తగ్గిస్తాయి.

జుట్టు ఆరోగ్యం

గుడ్డు జుట్టు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్డు పచ్చసొన బయోటిన్ గొప్ప మూలం. ఈ బయోటిన్ జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచడానికి సహాయపడుతుంది.

click me!