ఉప్పుకు ప్రత్యామ్నాయం... అచ్చం అదే రుచిని ఇస్తాయి..!

First Published | May 21, 2024, 1:10 PM IST

ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవాలని, చాలా తక్కువగా తీసుకోవాలని  చెబుతూ ఉంటారు. అయితే.. ఉప్పుకు బదులు.. దానిని రుచిని అందించేలా.. వేరే ఫుడ్స్ ని వంటలో కలపడం వల్ల.. మీరు రుచిని పొందవచ్చని మీకు తెలుసా? అలాంటి ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం...

ఉప్పులేని కూరకు రుచి ఉంటుందా..? మనం ఆ కూరలో ఎన్ని వేసినా.. ఉప్పు వేయకపోతే.. దానిని నోట్లో కూడా పెట్టుకోలేం. వేసేది ఒక స్పూన్ అయినా..  వంట మొత్తానికి రుచిని అందిస్తుంది. అంత స్పెషాలిటీ  ఉన్న ఈ ఉప్పును ఎక్కువగా తినడం కూడా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.  ఉప్పు ఎక్కువగా తింటే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అలా వచ్చిన వారు.. ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవాలని, చాలా తక్కువగా తీసుకోవాలని  చెబుతూ ఉంటారు. అయితే.. ఉప్పుకు బదులు.. దానిని రుచిని అందించేలా.. వేరే ఫుడ్స్ ని వంటలో కలపడం వల్ల.. మీరు రుచిని పొందవచ్చని మీకు తెలుసా? అలాంటి ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం...

ఉప్పు.. మన శరీరానికి చాలా అవసరం. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ని సమతుల్యం చేయడానికి, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్థారించడానికి, హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది అయితే.. మన శరీరానికి రోజుకి 500 గ్రాముల ఉప్పు సరిపోతుందట.

Latest Videos


అంతకంటే  ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టిన సమయంలోనే  బిపీలు, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు పెరుగుతాయి. అందుకే.. ఇప్పుడు ఉప్పు స్థానంలో వీటితో మీ ఫుడ్ రి ప్లేస్మెంట్ చేయాలి.

1.నిమ్మరసం..
మీరు ఆహారంలో ఉప్పుకు బదులుగా నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. దీని ఆమ్ల రుచి ఆహారానికి ఉప్పు లాంటి రుచిని జోడించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎక్కువ పిండితే మీకు పులుపు తెలుస్తుంది. కాస్త కలిపితే.. ఉప్పు లేని లోటు తీర్చుతుంది. 

2.వెల్లుల్లి..
ఉప్పుకు బదులుగా, మీరు ఆహారం రుచిని పెంచడానికి వెల్లుల్లిని ఉపయోగించవచ్చు. ఇది మాంగనీస్, విటమిన్ సి , విటమిన్ B6 కి మంచి మూలం. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో వెల్లుల్లి రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది.

3.నల్ల మిరియాలు..
 నల్ల మిరియాలు మీ ఆహారం రుచిని పెంచుతాయి. నల్ల మిరియాలు గుండె జబ్బులు , క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాపును తగ్గిస్తాయి. ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.


4.యాలకుల పొడి..
యాలకుల పొడి ఉప్పుకు గొప్ప ప్రత్యామ్నాయం. ఇది యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మసాలా. ఈ పొడిని చట్నీ, కూర, పప్పులో చేర్చుకోవచ్చు. ఇది ఆహారం  రుచిని రెట్టింపు చేస్తుంది. మీ ఆరోగ్యానికి హాని కలిగించదు.

ఇవన్నీ ఉప్పుకు ప్రత్యామ్నాయం అని చెప్పాం కదా అని  అసలు ఉప్పు లేకుండా వీటిని వేయడం వల్ల మీకు పెద్దగా తేడా తెలియకపోవచ్చు. అలా కాకుండా.. చాలా తక్కువ ఉప్పు వేసి.. మిగిలిన రుచిని పైన చెప్పిన ఫుడ్స్ తో బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. 

click me!