ఇలాంటి వారు కూడా లస్సీ తాగకూడదు.
లాక్టోస్ అసహనం ఉన్నవారు కూడా లస్సీని తాగకుండా ఉండటమే మంచిది. నిజానికి ఇది ఒక సాధారణ జీర్ణ సమస్య. దీనిలో జనాలు లాక్టోస్, పాలు, పాల ఉత్పత్తులను జీర్ణించుకోవడంలో ఇబ్బంది పడతారు. లాక్టోస్ అసహనం ఉన్నవారికి పెరుగు లేదా లస్సీ తీసుకోవడం వల్ల కడునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే ఇలాంటి వారు లస్సీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్లు ఎండాకాలంలో లస్సీకి బదులుగా రసం, నిమ్మరసం లేదా కొబ్బరి నీటిని తాగాలి. దీంతో వీరి జీర్ణ ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగదు.