మీ చిన్నప్పటి నుంచీ చూసే ఉంటారు.. ప్రతీ ఏడాది మామిడి, ఉసిరి, వెల్లుల్లి వంటి ఊరగాయలను ఈ సీజన్ లో పెట్టడం. నిజానికి ఈ పికిల్స్ మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. వివిధ రకాల ఊరగాయల వల్ల కలిగే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మకాయ ఊరగాయ ప్రయోజనాలు
నిమ్మకాయ ఊరగాయను చాలా మంది పెడుతుంటారు. ఈ సిట్రస్ ఊరగాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. నిమ్మకాయ ఊరగాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అాలగే దీనిలో ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి సహాయపడుతుంది. కొత్తిమీర, జీలకర్ర వంటి ఊరగాయలోని మసాలా దినుసులు కిడ్నీల్లో చిన్న చిన్న రాళ్లను కరిగిస్తాయి. అంతేకాకుండా నిమ్మకాయ ఊరగాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ లక్షణాలు కిడ్నీల్లో రాళ్ల వల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ ఊరగాయలో ఉండే పొటాషియం కండరాల తిమ్మిరి రాకుండా చేయడానికి, శరీరంలో ఎలక్ట్రోలైట్లను నియంత్రించడానికి పనిచేస్తాయి.
మామిడి పచ్చడి
మామిడి పచ్చడిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడికాయ ఊరగాయను తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. ఇది జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. మామిడిలో ఉండే నేచురల్ ఫైబర్స్ మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడతాయి. అలాగే ఆకలిని ప్రేరేపిస్తాయి.
మామిడి కాయ పచ్చడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాలు వేగంగా ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే అంటువ్యాధులకు దూరంగా ఉండేందుకు మన రోగనిరోధక శక్తిని పెంచతుంది. అలాగే పోషకాల సమృద్ధి మొక్కల ఆధారిత ఆహారాల నుంచి ఇనుమును గ్రహించడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లి ఊరగాయ ప్రయోజనాలు
వెల్లుల్లిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఊరగాయ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తం గడ్డకట్టడానికి, రక్త ప్రసరణ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి ఊరగాయ గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ ఊరగాయలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ముఖంపై అకాల ముడతలు, సన్నని గీతలు రావు. వెల్లుల్లి ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పిని కూడా తగ్గిస్తుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్య చాలా వరకు తగ్గుతుంది.
garlic
garlic
ఉసిరి ఊరగాయ ప్రయోజనాలు
ఉసిరి ఊరగాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ నుంచి నష్టం నుంచి కాపాడుతాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఉసిరి ఊరగాయలో ఉండే పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మంట, ఇతర హానికరమైన ఇన్ఫెక్షన్లకు మనల్ని దూరంగా ఉంచుతుంది. ఈ రకమైన ఊరగాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇవి అంటువ్యాధుల నుంచి మన కణాలను రక్షించడానికి సహాయపడతాయి.