మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అరటిపండు ఒకటి. దీన్ని తింటే తొందరగా కడుపు నిండటమే కాకుండా.. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. మొత్తంగా అరటి మనల్ని హాస్పటల్ కు దూరంగా ఉంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటారు నిపుణులు.
ప్రతిరోజూ ఒక అరటిపండును తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ ఒక అరటి పండును తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అరటిపండు ప్రీబయోటిక్స్ కు మంచి వనరు. ఈ ప్రీబయోటిక్స్ మీ గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది మన పేగులో ఇప్పటికే ఉన్న మంచి బ్యాక్టీరియాను మరింత పెంచతుుంది. అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది.
Fruits
అరటిపండు పొటాషియానికి మంచి మూలం. ఇది కండరాలు, నరాల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కండరాలలో తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది. ఇందులో సోడియం పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇకపోతే దీనిలో ఉండే పొటాషియం నరాల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దీనిలో నిజం లేదంటున్నారు నిపుణులు. అరటిపండు ఫైబర్ కు మంచి వనరు. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అరటి పండు మంచి శక్తి వనరు.