మనలో చాలా మంది టీ లవర్స్ ఉంటారు. వారికి ఉదయం లేచిన వెంటనే కడుపులో టీ పడాల్సిందే. ఉదయం ఒక్క పూటతో ఆగుతుందా అంటే అదీ లేదు. మళ్లీ సాయంత్రం 4 అయ్యిందా మళ్లీ టీ తాగాల్సిందే. ఆ టైమ్ కి వాళ్లకు టీ తాగకపోతే... ఇంక ఏ పనీ చేయలేరు. కానీ... అలా సాయంత్రం పూట టీ అందరూ తాగకూడదట. కొందరు అయితే... అసలు తాగకూడదట. ఎలాంటి వాళ్లు సాయంత్రం పూట టీకి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ, కాఫీలో ఉుండే కెఫిన్ మన నిద్రకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మనం రాత్రి పడుకోవడానికి పది గంటల ముందు ఎలాంటి కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. అంటే... సాయంత్రం పూట టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు మీరు రాత్రి 11-12 గంటలకు నిద్రపోతే, మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు టీ లేదా కాఫీ తీసుకోకూడదు.
సాయంత్రం పూట టీ తాగితే, కాలేయం డీటాక్సిఫై కాకుండా కార్టిసాల్ స్థాయిలను , వాపును పెంచుతుంది. అదనంగా, ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.ముఖ్యంగా రాత్రిపూట నిద్రలేమి ఇబ్బంది పడే వారు సాయంత్రం పూట టీ తాగకూడదు. కప్పులకు కప్పులు టీ తాగేసి.. తర్వాత మాకు నిద్రపట్టడం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలా మంది. అలాంటివారు.. ముందు ఈ సాయంత్రం పూట టీ తాగడం ఆపితే.. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుంది.
కొందరు తమకు స్ట్రెస్ గా ఉందని, ఆందోళనగా ఉందని టీ తాగుతూ ఉంటారు. కానీ... నిజంగా అలా ఒత్తిడి, ఆందోళన లో ఉన్నవారే.. టీలకు దూరంగా ఉండటం మంచిది.
high intak
పొట్టలో గ్యాస్ ఎక్కువగా ఏర్పడటం, పొడి చర్మం, పొడి జుట్టు ఉన్నవారు సాయంత్రం పూట టీ తాగకూడదు. మరింత గ్యాస్ సమస్య పెరుగుతుంది. డ్రై స్కిన్ సమస్య పెరుగుతుంది.
మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పటికీ లేదా మీరు బరువు తక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రం టీకి దూరంగా ఉండండి.
మీ జీవక్రియ బలహీనంగా ఉంటే, మీరు తరచుగా గ్యాస్, ఆమ్లత్వం,మలబద్ధకం పొందుతారు , మీకు ఆకలి అనిపించదు, సాయంత్రం టీ తాగవద్దు. ఈ సమస్యలు ఉన్నవారు వీలైనంత వరకు టీ కి దూరంగా ఉండటం మంచిది.