లవంగాలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Mar 21, 2024, 11:42 AM IST


లవంగాలను ఎక్కువగా ఫుడ్ లోనే వేస్తుంటారు. కానీ వీటిని అలాగే కూడా తినొచ్చు. ముఖ్యంగా వీటిని నానబెట్టి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
 

లవంగాలు ఎన్నో ఔషదగుణాలున్న మసాలా దినుసులో. ఈ మసాలా దినుసులో విటమిన్ సి, విటమిన్ కె, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. లవంగాలను ఆహారం ద్వారే కాకుండా అలాగే కూడా తినొచ్చు. ముఖ్యంగా వీటిని నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది నమ్ముతారు. అసలు లవంగాలను నానబెట్టి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

cloves

మెరుగైన జీర్ణక్రియ 

జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి నానబెట్టిన లవంగాలు ఎంతో ప్రయోజరకరంగా ఉంటాయి. ప్రతి రోజూ ఉదయాన్నే నానబెట్టిన లవంగాలను తింటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి ఎన్నో జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ఇది మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. 
 

Latest Videos


cloves 07

చర్మానికి మేలు 

లవంగాలు మీ చర్మానికి కూడా మేలుచేస్తాయి. లవంగాల్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. లవంగాలను నానబెట్టి తింటే మీ చర్మం 40 ఏండ్ల వయసులోనూ 20 వయసు వారిలాగ కనిపిస్తుంది. లవంగాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ముడతలు తొందరగా రాకుండా చేస్తాయి. 

మధుమేహాన్ని నియంత్రిస్తుంది

లవంగాల్లో ఎన్నో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి. ఇవి డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ప్రతి రోజూ పరిగడుపున నానబెట్టిన 2 లవంగాలను తినాలి. దీనివల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. 
 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

లవంగాల్లో విటమిన్ సి, విటమిన్ కెలతో పాటుగా మాంగనీస్ కూడా మెండుగా ఉంటుంది. ఇవన్నీ మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. నానబెట్టిన లవంగాలన రెగ్యులర్ గా తినడం వల్ల ఎన్నో రోగాలొచ్చే ముప్పు తగ్గుతుంది. 
 

నోటి దుర్వాసనను పోగొడుతుంది

నానబెట్టిన లవంగాల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లో చెడు వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. అందుకే వీటిని తింటే నోట్లో నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. 
 

వాపును తగ్గిస్తుంది

నానబెట్టిన లవంగాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరం మంటను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. నానబెట్టిన లవంగాలను తింటే కీళ్ల నొప్పి, మోకాళ్ల వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. 

బరువు తగ్గుతారు

బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే లవంగాలను తిన్నా కూడా మీరు బరువు తగ్గుతారు. అవును లవంగాలను తింటే మెటబాలిజం పెరుగుతుంది. దీంతో కేలరీలు బర్న్ అవుతాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే లవంగాలను నానబెట్టి తినండి. 

click me!