fennel water
సోంపు అందరికీ తెలిసే ఉంటుంది. సాధారణంగా మనం సోంపుని కొన్ని రకాల వంటల్లో మాత్రమే చాలా అరుదుగా వాడుతూ ఉంటాం. లేదంటే.. కడుపు నిండుగా భోజనం చేసిన తర్వాత.. కొద్దిగా నోట్లో వేసుకుంటాం. అలా కొద్దిగా సోంపు వేసుకుంటే.. ఫుల్ గా తిన్న ఆహారం కూడా సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతేనా... నోటి దుర్వాసనను కూడా చిటికెలో దూరం చేసేస్తుంది. అయితే... ఇప్పటి వరకు మనం సోంపు గింజలు గా తిన్నాం. కానీ.. అదే సోంపుని నీటిలో మరిగించి తీసుకుంటే.. మరింత ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో మనమూ ఇప్పుడు తెలుసుకుందాం...
fennel water
సోంపు వాటర్ ని తాగడం వల్ల.. మనకు ఒక తాజా అనుభూతి కలుగుతుంది. నోరంతా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు.. మన ఓవరాల్ హెల్త్ కి కూడా ఈ నీరు ఎంతగానో ఉపయోగపడతాయి.
చాలా మంది ఆహారం కొంచెం తిన్నా కూడా.. అరుగుదల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు రోజూ ఈ సోంపుని మరిగించిన నీరు లేదంటే. రాత్రి సోంపు గింజలను నానపెట్టిన నీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల.. వారిలో అరుగుదల సమస్యలు తగ్గిపోతాయి. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది.
ఫుడ్ కాస్త ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్ట అంతా బరువుగా, హెవీగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటప్పుడు చిన్న గ్లాసు సోంపు నీరు తాగితే.. వెంటనే పొట్ట నార్మల్ గా అయినట్లుగా, లైట్ గా మారిన అనుభూతి కలుగుతుంది.
ఇక.. చాలా మంది బరువు తగ్గేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. ఈ సోంపు వాటర్ తాగితే సులభంగా బరువు కూడా తగ్గొచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. ఈ సోంపు వాటర్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మనకు ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. రోజూ ఉదయాన్నే ఈ సోంపు వాటర్ తాగడం వల్ల... ఇది మంచి డీటాక్సిక్ డ్రింక్ గా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ అన్నింటినీ తొలగిండచంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెగ్యులర్ గా తాగడం వల్ల.. బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది.
ఇక.. ఈ రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. ఏవైనా వచ్చినా వాటిని తట్టుకోవాలంటే మనకు ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం. ఈ రోగనిరోధక శక్తిని మనకు ఈ సోంపు వాటర్ అందిస్తాయి. సీజనల్ గా పిల్లలు, పెద్దలకు వచ్చే జలుబు, ఫ్ల్లూ వంటివి రాకుండా ఆపడంలో,. ఈ సోంపు వాటర్ కీలకంగా పని చేస్తుంది. అంతేకాదు చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతుంది.
మీరు నమ్మరు కానీ.. సోంపు వాటర్ మన కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సోంపులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. దాని వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసు రిత్యా వచ్చే కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది షుగర్ తో బాధపడుతున్నారు. అయితే... షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండాలి అంటే.. ఈ సోంపు వాటర్ తాగాల్సిందే. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటంతో పాటు.. మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది.
fennel water
మహిళల్లో ప్రతి నెలా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఎంత నొప్పి ఉంటుందో భరించే మహిళలకే తెలుస్తుంది. అలాంటి నొప్పిని తగ్గించడంలోనూ ఈ సోంపు వాటర్ కీలకంగా పని చేస్తుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ వాటర్ తాగితే సరిపోతుంది. చాలా త్వరగా రిలీఫ్ ని ఇస్తుంది.
ఈ సోంపు వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల... చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ కీలకంగా పని చేస్తుంది. రెగ్యులర్ గా సోంపు వాటర్ తాగడం వల్ల... మీ అందం పెరగడం ఖాయం. చర్మం ఫ్లాలెస్ గా కనిపిస్తుంది.