ప్రపంచంలో ఎక్కువగా తినే ఆహారాలలో అన్నం ఒకటి. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవే మన దైనందిన కార్యకలాపాలకు అవసరమైన శక్తిని ఇస్తాయి. అంతేకాక ప్రతి దేశంలోని ఆహార సంస్కృతి కూడా ఆయా ప్రాంతాలలో నివసించే వారి ఆరోగ్యానికి ఇదే ఆధారం కూడా. అన్నంలోని కార్భోహైడ్రేట్లు మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. దీంతో మనం రోజువారి పనులను పూర్తిచేసుకోగలుగుతాం.
అయితే అన్నం తింటే బరువు పెరుగుతారన్న వాదన కూడా ఉంది. ఈ మాటను మీరు వినే ఉంటారు. అందుకే బరువు తగ్గడానికి ఆహారం నుంచి అన్నాన్ని పూర్తిగా మానేసే వారు కూడా ఉన్నారు. బరువు తగ్గాలంటే నిజంగా అన్నాన్ని పూర్తిగా మానేయాలా? అన్నం వల్లే బరువు బాగా పెరిగిపోతారా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి.
rice
బియ్యంలో కార్బోహైడ్రేట్లతో పాటుగా మెగ్నీషియం, ఫైబర్, భాస్వరం, మాంగనీస్, సెలీనియం, ఐరన్, బి విటమిన్లు వంటి మన ఆరోగ్యానికి అవసరమైన పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారకాలన్నీ జీర్ణక్రియ, శక్తి ఉత్పత్తి, కొవ్వును బర్న్ చేయడం, హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.
ఇన్ని ఉన్నప్పటికీ బియ్యం కూడా బరువు పెరగడానికి దారితీస్తాయి. లిమిట్ లో తింటే ఈ సమస్య ఉండదు. అన్నాన్ని మోతాదుకు మించి తినడం వల్లే బరువు పెరిగిపోతారు. మీరు బరువు పెరగకూడదంటే అన్నం తినే పరిమాణాన్ని తగ్గించడమే దీనికి పరిష్కారం.
ముఖ్యంగా ఇప్పటికే స్థూలకాయం ఉన్నవారు, మధుమేహంతో బాధపడేవారు అన్నం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు రోజుకు ఒకసారి మాత్రమే అన్నం తినాలి. అలాగే అన్నంతో పాటుగా కూరగాయలను చేర్చకపోవడం పోషకాహార లోపానికి దారితీస్తుంది. అందుకే కూరగాయలను ఎక్కువగా తినాలి. అన్నం తక్కువగా తినాలి.
rice
అలాగే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ యే మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే తెల్ల బియ్యం మంచిది కాదని దీని అర్థం కాదు. బరువు తగ్గించే డైట్ కు వైట్ రైస్ కాస్త బెటర్. బరువు తగ్గాలంటే అన్నాన్ని ఆహారం నుంచి పూర్తిగా తొలగించడం పూర్తిగా మంచిది కాదు. ఒకవేళ మీరు అన్నాన్ని పూర్తిగా మానేయాలనుకంుటే వైద్యుడికి తెలియజేసి, అవసరమైన సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే చేయండి. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.