ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు ఆఫీసు వర్కులు చేసుకుంటూ.. ఇంటిని కూడా హ్యాండిల్ చేస్తున్నారు. అలాంటి వారు వంట తొందరగా అయ్యే పద్దతులను వెతుకుతూ ఉంటారు. దాదాపు అన్ని వస్తువులు రెడీగా ఉంటే.. కాస్త వంట చేయడం సులభంగా ఉంటుంది. వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకటి. దీనిని అప్పటికప్పుడు రుబ్బుకొని.. వంటలో వేయాలంటే చాలా సమయం పడుతుంది. అదే.. ఎక్కువ చేసి ఉంచుకుందాం అంటే.. సరిగా నిల్వచేసే పద్దతి తెలియకపోతే.. తొందరగా వాసన రావడం, పాడవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటిది జరగకుండా ఉండాలంటే.. మనం సరైన పద్దతిలో ఈ అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని తయారు చేసకోవాలి. ఎన్ని నెలలు అయినా పాడవ్వకుండా ఉండాలంటే.. ఈ అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓసారి చూద్దాం..