వర్షాకాలంలో కమ్మని స్నాక్స్... బరువు కూడా పెరగరు..!

First Published | Jul 6, 2022, 9:10 AM IST

బరువు తగ్గాలి అనుకునేవారికి మాత్రం కష్టంగా ఉంటుంది. తినాలనే కోరిక మనసులో ఉన్నా.. తింటే.. బరువు పెరుగుతామేమో అనే భయం వారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే.. బరువు పెరుగుతాము అనే భయం లేకుండా... కమ్మగా స్నాక్స్ ఆరగించే అవకాశం ఉందట.

snacks

వర్షాకాలం మొదలైంది. తొలకరి చినుకులు పడుతూ ఉంటే... ఇంట్లో వేడి వేడిగా ఏవైనా స్నాక్స్ తినాలనే కోరిక అందరిలోనూ కలుగుతుంది. సమోసా, పకోడి లాంటి వాటిని వేడి వేడిగా చేసుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది. అయితే.. ఈ ఆహారాలు తినడానికి నోటికి కమ్మగా ఉన్నా.. బరువు తగ్గాలి అనుకునేవారికి మాత్రం కష్టంగా ఉంటుంది. 

తినాలనే కోరిక మనసులో ఉన్నా.. తింటే.. బరువు పెరుగుతామేమో అనే భయం వారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే.. బరువు పెరుగుతాము అనే భయం లేకుండా... కమ్మగా స్నాక్స్ ఆరగించే అవకాశం ఉందట. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తూ.. మన జిహ్వ రుచిని సంతృప్తి పరుస్తూ.. మీ ఫిట్నెస్ లక్ష్యాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే.. ఈ కింద స్నాక్స్ ని ఎలాంటి భయం లేకుండా ఆరగించవచ్చు. మరి ఆ స్నాక్స్ ఏంటి..? వాటిని తయారు చేసుకోవడం ఎలాగో ఓసారి చూద్దాం...

Latest Videos


మూంగ్ దాల్ సమోసాలు..

మూంగ్ దాల్.. బరువు తగ్గాలి అనుకునేవారికి చక్కటి పరిష్కారం. ఈ మూంగ్ దాల్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జీవ క్రియను పెంచడంతో పాటు.. బరువు తగ్గించడంలోనూ సహాయపడతాయి. మనం సాధారణంగా సమోసాలను.. బంగాళ దుంపలతో తయారు చేసుకొని తింటాం.. అయితే.. ఈ బంగాళ దుంపల సమోసాలతో సులభంగా బరువు పెరుగుతాం. కాబట్టి.. ఆ స్థానంలో మూంగ్ దాల్ ను ఉపయోగించి సమోసాను తయారు చేసుకొని తింటే.. బరువు పెరుగుతాం అనే భయం ఉండదు.
 

ఈ  మూంగ్ దాల్ సమోసా కోసం.. ముందుగా పిండిని తయారు చేసుకోవాలి. ముందుగా పిండిలో ఉప్పు, నూనె వేసి నీటితో పిండిని మెత్తగా కలుపుకోవాలి. కొద్ది సేపు కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత... సమోసా లోపలి మిశ్రమం తయారు చేసుకోవాలి. ముందుగా కొన్ని గంటలపాటు నాన పెట్టుకున్న మూంగ్ దాల్ ని గ్రైండ్ చేయాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి.. తర్వాత అందులో కొద్దిగా ఇంగువ వేసి.. తర్వాత గ్రైండ్ చేసుకున్న మూంగ్ దాల్ మిశ్రమాన్ని వేయాలి. బాగా వేయించిన తర్వాత.. దానిలో మసాలాలు వేసుకోవాలి. తర్వాత.. ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. 

ఇప్పుడు.. ముందుగా కలిపి పెట్టుకున్న సమోసా పిండితో.. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత వాటిని సమోసా ఆకారంలో చుట్టుకోవాలి. అందులోకి తయారు చేసుకున్న మూంగ్ దాల్ మిశ్రమాన్ని ఉంచాలి. అలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత.. బాండీలో నూనె వేసి ఎర్రగా వేగే వరకు కాల్చుకోవాలి. అంతే.. వేడి వేడి మూంగ్ దాల్ సమోసా రెడీ. వీటిని వేడిగా ఉన్నప్పుడు కమ్మగా ఆరగించవచ్చు.

చిలగడదుంప పకోడీలు..

చిలగడ దుంప.. దీనినే స్వీట్ పొటాటోస్ అని కూడా అంటారు. వీటిలో ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ స్వీట్ పొటాటోలు బరువు తగ్గడానికి మనకు ఎంతగానో సహాయం చేస్తాయి. అంతేకాదు.. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటితో తయారు చేసిన పకోడిలు మనకు రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.

వీటిని ఎలా తయారు చేయాలంటే... ముందుగా.. చిలగడ దుంపలను శుభ్రంగా కడిగాలి. తర్వాత వాటి తొక్కు తొలగించాలి. తర్వాత.. వీటిని సన్నగా తురుముకోవాలి. ఆ తరుములో ఉల్లిపాయ, కొద్దిగా ఉప్పు, సన్నగా కత్తిరించిన కరివేపాకు, పసుపు, కొద్దిగా ఆమ్ చూర్ పౌడర్ వేయాలి. కొద్దిగా కారం, శెనగ పిండి కూడా వేసిబాగా కలుపుకోవాలి. అవసరమైతే నీరు కలుపుకోవచ్చు.

తర్వాత నూనెను వేడి చేసి, అందులో పిండిని పకోడీలుగా వేసుకోవాలి. వాటిని  బంగారు గోధుమ రంగు,  క్రిస్పీగా అయ్యే  వరకు డీప్ ఫ్రై చేయండి. దీన్ని కొంచెం చట్నీ, టీతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.

3.రోస్టెడ్ శెనగలు..

శెనగలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని రోజూ తీసుకోవచ్చు. శెనగల్లో ప్రోటీన్ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాగా.. ఈ రోస్టెడ్ శెనగలను వర్షం పడిన సమయంలో స్నాక్స్ గా తీసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ముందుగా నీటితో శుభ్రం చేసి.. తర్వాత రోస్ట్ చేసుకోవాలి. ఓవెన్ లో సైతం వీటిని రోస్ట్ చేసుకోవచ్చు. అంతే.. వేడిగా ఉన్నప్పుడే.. కొద్దిగా.. ఉప్పు, కారం చల్లుకొని తినవచ్చు.

4. రోస్టెడ్ మఖానా

మఖానా ప్రోటీన్, ఫైబర్ కి  మంచి మూలం. ఇది మళ్లీ బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయం చేస్తుంది.

మీరు నెయ్యి లేదా ఆలివ్ నూనెతో తేలికగా వేడిచేసిన పాన్లో దీన్ని సిద్ధం చేయవచ్చు. పాన్‌లో ¼ టేబుల్‌స్పూన్ ఉప్పు, ఎర్ర కారం పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, వెల్లుల్లి పొడి, జీలకర్ర పొడిని వేసి కలపాలి. మసాలాలు తేలికగా వేయించిన తర్వాత, మఖానా వేసి బాగా కలపాలి. బంగారు గోధుమ రంగు వచ్చేవరకు సుమారు 5-7 నిమిషాలు వేయించి సర్వ్ చేస్తే సరిపోతుంది.
 

click me!