ఇవి తింటే.. స్ట్రెస్ వెంటనే తగ్గుతుంది

First Published | Nov 16, 2024, 12:15 PM IST

ఒత్తిడి లైట్ గా తీసిపారేసేంత చిన్న సమస్య అయితే కాదు. ఇది జస్ట్ మీ మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే మాత్రం స్ట్రెస్ వెంటనే తగ్గుతుంది. 

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి, యాంగ్జైటీకి, డిప్రెషన్ కు బాగా గురవుతున్నారు. ఈ సమస్యలు చాలా చిన్నగా అనిపించొచ్చు. ఇవి మానసిక సమస్యలే అయినా.. ఇవి ఎన్నో శారీరక సమస్యలను కూడా కలిగిస్తాయి. వీటికి సకాలంలో వైద్య సహాయం తీసుకోకపోతే పోతే మీ ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మనం తీసుకునే కొన్ని ఆహారాలు మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. శారీరక ఆరోగ్యన్ని కూడా బాగా ఉంచుతాయి. ఏ ఆహారాలను తింటే ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


ఆకు కూరలు

ఆకు కూరలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయపడతాయి. బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరల్లో ఉండే మెగ్నీషియం యాంగ్జైటీని, ఒత్తిడిని మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయపడుతుంది.

మెగ్నీషియం భోవోద్వేగాలను, మనోభావాలకు కారణమయ్యే మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. మీ రోజువారి ఆహారంలో ఆకుకూరల్ని చేర్చితే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. 
 


కొవ్వు చేపలు

సార్డినెస్, సాల్మన్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు కూడా మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెండగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇవి యాంగ్జైటీ, ఒత్తిడిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

ఈ చేపల్లో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే మీ మొత్తం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వారానికి రెండు, మూడు సార్లు మీరు ఫ్యాటీ ఫిష్ ను తింటే ఒత్తిడి క్రమంగా తగ్గడం మొదలవుతుంది. 
 

గింజలు, విత్తనాలు

గింజలు, విత్తనాలు కూడా మన మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు గనుక ప్రతిరోజూ వాల్ నట్స్, బాదం, అవిసె గింజలు, చియా విత్తనాలు వంటి గింజలను, విత్తనాలను తింటే మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు బ్రెయిన్ ను హెల్తీగా ఉంచడానికి సహాయపడతాయి. 

వీటిలో కూడా జింక్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవన్నీ మీ ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించడానికి సహాయపడతాయి. విత్తనాలను, గింజల్ని మీరు రోజూ స్నాక్స్ గా తింటే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. 
 

బెర్రీలు

బ్లాక్ బెర్రీలు, బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి రకరకాల బెర్రీలను తినడం వల్ల మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

ఇవి మీ శరీరంలో మంటను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అలాగే నిరాశ, ఒత్తిడి, యాంగ్జైటీ లక్షణాలను కూడా తగ్గిస్తాయి. 

Latest Videos

click me!