Watermelon: పుచ్చకాయ తొక్క తింటే ఆ కోరికలు పెరుగుతాయా?

Published : Feb 16, 2025, 04:21 PM IST

చిన్నపిల్లల దగ్గరినుంచి పెద్దవాళ్ల వరకు పుచ్చకాయను అందరూ ఇష్టంగా తింటారు. పుచ్చకాయ పండులోనే కాదు, దాని తొక్కతో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. పుచ్చకాయ తొక్క తినడం వల్ల మగవారికి ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఇంతకీ అవెంటో తెలుసుకోండి.

PREV
18
Watermelon: పుచ్చకాయ తొక్క తింటే ఆ కోరికలు పెరుగుతాయా?

పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతమంచిదో అందరికీ తెలుసు. పుచ్చకాయ జ్యాసుతో పాటు గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ దాని తొక్కలో కూడా అనేక పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా? మరీ ముఖ్యంగా మగవారికి మేలుచేసే ఎన్నో పోషకాలు ఉన్నాయట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

28
పరిశోధన ప్రకారం

కొన్ని పరిశోధనల ప్రకారం, పుచ్చకాయ తొక్క లైంగిక కోరికను పెంచడంలో సహాయపడుతుందట. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు లైంగిక కోరికను ప్రోత్సహిస్తాయట. పుచ్చకాయ తొక్కపై నిమ్మరసం, మిరియాల పొడి చల్లుకొని తినవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. ముఖ్యంగా మగవారు తొక్కను ఎక్కువగా తినడం వల్ల వారి శక్తి పెరుగుతుందట.

38
పుచ్చకాయ తొక్కలో..

పుచ్చకాయ తొక్కలో సిట్రులైన్ సమృద్ధిగా ఉంటుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం, సిట్రులైన్ రక్తనాళాల విస్తరణను పెంచుతుంది. ఇది కండరాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది.

48
రక్తపోటు నియంత్రణ

పుచ్చకాయ తొక్క తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పబ్‌మెడ్ సెంట్రల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఊబకాయం ఉన్న పెద్దవారిలో అధిక రక్తపోటును నియంత్రించడంలో పుచ్చకాయ తొక్క ప్రభావవంతంగా పనిచేసింది. 

అధిక రక్తపోటు ఉన్నవారికి సిట్రులైన్ సప్లిమెంట్లు రక్తపోటును తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వేసవిలో పుచ్చకాయ తొక్క తినాలనుకుంటే, కొంత సమయం ఫ్రిజ్‌లో ఉంచి తినవచ్చు.

58
యాంటీఆక్సిడెంట్లు

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పుచ్చకాయ తొక్కలో లైకోపీన్, ఇతర ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి. తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. వయసు పెరిగే కొద్దీ చర్మంలో వచ్చే ముడతల లాంటి సమస్యలను ఈ తొక్క దూరం చేస్తుంది.

68
విటమిన్ సి

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పుచ్చకాయ తొక్కలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. విటమిన్ సి తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

78
బరువు తగ్గడానికి

పుచ్చకాయ తొక్కలో కేలరీలు తక్కువ. ఇది ఫైబర్ కు మంచి మూలం. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. పబ్‌మెడ్ సెంట్రల్ ప్రకారం, పుచ్చకాయ తొక్క తినడం వల్ల కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు పొందుతారు. ఇది జీవక్రియను పెంచుతుంది. శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది

88
తొక్కను ఎలా తినాలి?

పుచ్చకాయ తొక్కను ముక్కలుగా కోసి సలాడ్‌లు, కూరగాయలు, సూప్‌ల తయారీలో వాడవచ్చు. చట్నీలా నూరి తినడం మంచిది. పుచ్చకాయ తొక్కను జ్యూస్‌గా కూడా తాగవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories