Healthy Teeth: పళ్లు ఆరోగ్యంగా, తెల్లగా మెరిసిపోవాలంటే.. ఈ ఫుడ్ తింటే చాలు!

Published : Feb 16, 2025, 01:57 PM IST

పళ్లు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. పళ్ల సమస్యలు ఉంటే ప్రశాంతంగా తినలేము. తాగలేము. కనీసం నవ్వలేము కూడా. అయితే కొన్ని ఆహార పదార్థాలు తినడం ద్వారా పళ్లు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పాలలాగా తెల్లగా మెరిసిపోతాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.

PREV
18
Healthy Teeth: పళ్లు ఆరోగ్యంగా, తెల్లగా మెరిసిపోవాలంటే.. ఈ ఫుడ్ తింటే  చాలు!

చిరునవ్వు మొహాన్ని మరింత అందంగా కనబడేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు నోటి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్ కారణంగా అనేక పళ్ల సమస్యలు ఎదురవుతున్నాయి. చాలామంది బలహీనమైన పళ్ళు, చిగుళ్ళ నుంచి రక్తం కారడం లాంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

28
పళ్ల సమస్యలకు చెక్

పళ్లు, చిగుళ్ల సమస్యల కారణంగా చాలామంది అందరిముందు నవ్వడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి కొన్నిమార్గాలు ఉన్నాయి. పళ్లు, చిగుళ్లను బలోపేతం చేయడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. పళ్ల సమస్యలకు ఇట్టే చెక్ పెట్టవచ్చు.

38
పాలు

పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకే కాదు, పళ్లు, చిగుళ్లకు కూడా చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ పాలు తాగితే నోటి ఆరోగ్యానికి చాలా మంచిది.

48
చీజ్

రోజువారి ఆహారంలో చీజ్‌ని చేర్చుకోవడం వల్ల పళ్లు, చిగుళ్లు బలపడతాయి. చీజ్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ప్రోటీన్ కూడా మంచిస్థాయిలో  ఉంటుంది.

58
పెరుగు

చీజ్ లాగే పెరుగులో కూడా కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అవి పళ్లను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పెరుగులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చిగుళ్లకు చాలా మేలు చేస్తుంది.

68
ఖర్జూరాలు

ఖర్జూర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా ఇవి నోటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల నోటిలో ఎక్కువ లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది పళ్లను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

78
ఆకుకూరలు:

ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరాన్ని అనేక సమస్యల నుంచి రక్షిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ నోటిని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.

88
ఇతర ఆహారాలు

- బ్రకోలీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, పళ్లను శుభ్రం చేయడానికి కూడా సహాయపడుతుంది.

- చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

- ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. ఆపిల్ పళ్ళ ఎనామిల్‌ను శుభ్రం చేసి, చిగుళ్ళను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

- క్యారెట్ తింటే పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

- ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చిగుళ్ల వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories