షుగర్ పేషెంట్లు వైట్ రైస్ ను తింటే?

First Published | Jun 8, 2023, 1:13 PM IST

డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. మధుమేహులు శుద్ధి చేసిన ఆహారాలను తినొద్దంటారు. ఇలాంటి వాటిలో తెల్లబియ్యం ఉన్నాయి. మరి మధుమేహులు వైట్ రైస్ ను తినొచ్చా? లేదా? నిపుణులు ఏమంటున్నారంటే? 

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగపోతోంది. ముఖ్యంగా మన దేశంలో షుగర్ పేషెంట్లు రోజు రోజుకు ఎక్కువవుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోకపోతే ఎన్నో రోగాలు వస్తాయి. అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను  సహజంగా నియంత్రించడానినకి ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు స్టార్చ్ తక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను తినడం మంచిది. 

డయాబెటిస్ పేషెంట్లు ఏది తినాలన్నా భయపడిపోతుంటారు. ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. స్వీట్ల నుంచి పండ్ల వరకు ఏవి రక్తంలో చక్కెరను పెంచొతాయోనని సందేహపడిపోతుంలారు. ఇలాంటి ఆహారాల్లో వీటిలో బియ్యం కూడా ఉన్నాయి.  మన దేశంలో చాలా మంది  మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. బియ్యంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెడ్ రైస్ రెండు  వైట్ రైస్.  తెల్ల బియ్యం మధుమేహ వ్యాధిగ్రస్తులు తినొచ్చా? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది.
 


మధుమేహ వ్యాధిగ్రస్తులకు వైట్ రైస్ కంటే రెడ్ రైసే ఎక్కువ మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ రెండింటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే రెడ్ రైస్ లో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే తెల్ల బియ్యంలో కంటే ఎర్ర బియ్యంలోనే  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. 
 

రెడ్ రైస్ లో చాలా న్యూట్రీషియన్స్ ఉంటాయి. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచిది. ఇందులో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. దీంతో రెడ్ రైస్ మన ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడుతుంది. ఫైబర్స్ పిండి పదార్ధాన్ని త్వరగా గ్రహించకుండా, కొవ్వుగా మారకుండా నిరోధిస్తాయి. అందుకే తెల్ల బియ్యంతో పోలిస్తే రెడ్ రైస్ డయాబెటిస్, స్థూలకాయంతో సమర్థంగా పోరాడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 

అయితే లిమిట్ లో వైట్ రైస్ ను తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. సింగపూర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మితమైన మొత్తంలో బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను ఏం పెంచవు.

Latest Videos

click me!