ఇంట్లోనే యమ్మీ, టేస్టీ చీజ్ తయారీ..!

First Published | May 29, 2021, 1:47 PM IST


పిజ్జా, బర్గర్ పక్కన పెట్టినా.. ఈ ఎండాకాలం ఎక్కువ మంది సలాడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఆ సలాడ్స్ లోకైనా చీజ్ కావాల్సిందే. అయితే.. ఆచీజ్ ని మనమే ఇంట్లో స్వయంగా తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంట్లో ఉన్నామంటే.. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ పిజ్జా, సాండ్ విచ్ లాంటివి ఎక్కువగా తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మరి వీటిని తినాలంటే.. ఇంట్లో తయారు చేసుకోవాలంటే చీజ్ తప్పనసరి.
undefined
పిజ్జా, బర్గర్ పక్కన పెట్టినా.. ఈ ఎండాకాలం ఎక్కువ మంది సలాడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఆ సలాడ్స్ లోకైనా చీజ్ కావాల్సిందే. అయితే.. ఆచీజ్ ని మనమే ఇంట్లో స్వయంగా తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
undefined

Latest Videos


ముంబయికి చెందిన చీజ్ మేకర్ ధ్వానీ దేశాయ్ చీజ్ గురించి మనకు తెలియని ఓ సీక్రెట్ ని బయటపెట్టారు. మార్కెట్లో మనం చూసే పసుపు రంగు చీజ్ నిజమైన చీజ్ కాదట. ఆ హార్డ్ ప్రాసెస్డ్ చీజ్ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదని చెబుతున్నారు. అందుకే.. మన ఇంట్లోని పెరుగుతో చీజ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్.
undefined
సలాడ్స్ లోకి పెరుగుతో క్రీమీ చీజ్ చేసుకొని తినొచ్చు అని ఆయన చెబుతున్నారు. పెరుగును 24గంటల తర్వాత దాని మేగడను బాగా బ్లెండ్ చేయాలి. అప్పుడు క్రీమీ చీజ్ తయారౌతుంది. నిజానికి అది పర్ఫెక్ట్ చీజ్ కాకపోయినా దాంట్లో రాక్ సాల్ట్, పెప్పర్ వేసుకొని కలిసి సలాడ్స్ లో తొనేయవచ్చట.
undefined
మోజరెల్లా చీజ్ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..మోజరెల్లా చీజ్ తయారు చేయడం కొంచెం కష్టమైన పని అని నిపుణులు చెబుతున్నారు. ఫుల్లీ క్రీమ్ పాలు, వెనిగర్, ఉప్పుతో ఫ్రెష్ మోజరెల్లా చీజ్ తయారుచేసుకోవచ్చట.
undefined
ముందుగా ఒక గిన్నెలోకి రెండు లీటర్ల క్రీమ్ పాలు తీసుకోవాలి. ఆ పాలను సన్నని మంట మీద వేడిచేస్తూ.. దానికి కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి.
undefined
పాలు బాగా వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పాల్లలో ఒక వేలు పెడితే.. అవి ఎంత వరకు వేడయ్యాయనే విషయం మనకు తెలుస్తుంది.
undefined
ఇప్పుడు ఆ పాలల్లో 4 స్పూన్ల వెనిగర్ ని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆ పాలను బాగా కలపాలి.
undefined
అలా చాలా సేపు కలిపిన తర్వాత.. ఆ పాలు .. చీజ్ మారిపోవడాన్ని మీరు గమనించవచ్చు.
undefined
ఇప్పుు కావాలంటే మరో స్పూన్ వెనిగర్ ని కలపొచ్చు. అలా కలపడం వల్ల త్వరగా చీజ్ తయారౌతుంది.
undefined
ఇప్పుడు.. చీజ్ గడ్డలాగా మారిన తర్వాత.. మిగిలిన నీటిని తీసేయాలి. కేవలం చీజ్ ని వరకు ఒక గిన్నెలోకి మార్చుకోవాలి.
undefined
ఇప్పుడు ఈ చీజ్ ని బాగా మరగపెట్టిన నీటిలో ఒక పదినిమిషాలపాటు ఉంచాలి. అలా ఉంచి.. చీజ్ ని బాగా కలుపుతూ ఉండాలి.
undefined
ఆ తర్వాత నీటిని మొత్తం పిండేసి.. చీజ్ ని బయటకు తీసేయాలి. ఆ తర్వాత చల్లటి నీటిలో రెండు నిమిషాలపాటు ఉంచాలి. తర్వాత నీటిని బాగా పిండేయాలి.
undefined
ఇప్పుడు చీజ్ ని ఓ కంటైనర్ లో పెట్టి ఫ్రిజర్ లో ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసి.. మనకు కావాల్సినప్పుడు చీజ్ ని వినియోగించుకోవచ్చు. ఈ చీజ్ చాలా రుచిగా ఉంటుంది.
undefined
click me!