బలహీనంగా ఉన్నారా? ఈ రసం తాగండి బలంగా మారుతారు

First Published | May 12, 2023, 1:41 PM IST

బలహీనంగా ఉంటే ఏ పనీ చేతకాదు. ఇలాంటి వారికి దానిమ్మ పండు బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. దానిమ్మలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసాన్ని తాగితే ఒంట్లో బలం పెరుగుతుంది. 
 

దానిమ్మలో ఐరన్ తో పాటుగా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసంలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, మెగ్నీషియం వంటి మూలకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి దానిమ్మలో కొన్ని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మీ నరాలు, కండరాలకు సమర్థవంతంగా పనిచేస్తాయి. దానిమ్మ రసం తాగితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటే..?
 

pomegranate juice

దానిమ్మ రసం నరాలకు మేలు చేస్తుంది

దానిమ్మలో ఎల్లాగిటానిన్లు అని పిలువబడే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి. అవి మంట, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. మీ నరాలకు బలాన్ని ఇస్తాయి. దీనిలోని మెగ్నీషియం నరాలు, కండరాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
 

Latest Videos


దానిమ్మ రసం కండరాల బలాన్ని పెంచుతుంది

దానిమ్మ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి కండరాల బలాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఐరన్ శరీరంలోని రక్తహీనతను తొలగించి కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ విధంగా దానిమ్మ రసం కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

దానిమ్మ జ్యూస్ ఎప్పుడు, ఎలా తాగాలి

రోజుకు ఒక్కసారైనా దానిమ్మ జ్యూస్ తాగాలి. ఫ్రెష్ జ్యూస్ ను తాగడానికి ప్రయత్నించండి. ఇది కండరాలకు, నరాలకు మాత్రమే కాదు ఇది మన మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

click me!