టేస్టీ నూడుల్స్ ఇంట్లోనే చేద్దాం.. దేశీ స్టైల్‌లో విదేశీ టెస్ట్‌తో అదరగొట్టేద్దాం?

First Published | Oct 5, 2021, 1:56 PM IST

చాలామంది విదేశీ ఫుడ్ ను బాగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ వాటికి ఈతరం బాగా అలవాటు పడింది. బయటికి వెళితే చాలు రకరకాల చైనీస్ ఫుడ్ లను మాత్రమే తింటారు. 

చాలామంది విదేశీ ఫుడ్ ను బాగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ వాటికి ఈతరం బాగా అలవాటు పడింది. బయటికి వెళితే చాలు రకరకాల చైనీస్ ఫుడ్ లను మాత్రమే తింటారు. మొత్తానికి మన దేశ రుచులతో పాటు విదేశ రుచులు కూడా అలవాటయ్యాయి.
 

ఇక నూడుల్స్ అనే చైనీస్ ఫుడ్ మాత్రం ప్రతి ఒక్కరికి రుచి చూపించింది. సన్నగా, పొడవుగా తీగవలె ఉండే ఈ నూడుల్స్ రుచికి బాగా స్పైసీగా ఉంటూ అందరికీ నోరూరిస్తుంది. ఇవి కూడా రోడ్లపై బాగా దొరుకుతుంది.
 


ఇక వీటికి కావలసిన పదార్థాలు మన ఇంట్లో ఉంటే మాత్రం సులువుగా మనమే స్వయంగా చేసుకొని తినేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీనిని వెజ్ లేదా నాన్ వెజ్ తో కూడా తయారు చేసుకోవచ్చు.  ఇంకేంటి ఆ పదార్థాలు ఏంటో తెలుసుకొని మన స్టైల్లో విదేశీ టెస్టుతో అదరగొట్టేద్దాం.
 

కావలసిన పదార్థాలు: నూడుల్స్, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్, ఉప్పు, మిరియాల పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటివి రుచికి సరిపడా విధంగా తీసుకోవాలి. ఇక ఇందులో వెజ్ అయితే కొన్ని కూరగాయలను నాన్ వెజ్ అయితే చికెన్ తో తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇందులో మీకు కావలసినవి తీసుకోవడం మంచిది.
 

తయారు చేసుకునే విధానం: ముందుగా మనం చికెన్ లేదా కూరగాయలు శుభ్రం చేసుకొని వాటికి ఉప్పు, కాస్త మిరియాల పొడి పట్టించాలి.
 

ఒక గిన్నె తీసుకొని అందులో కావలసినంత నీటిని తీసుకొని నూడుల్స్, టేబుల్ స్పూన్ నూనె వేసి రెండు లేదా మూడు పొంగులు వచ్చేవరకు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని వంపేసి నూడుల్స్ ను ఆరబెట్టాలి.
 

ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
 

ఇందులో సిద్ధం చేసుకొని ఉన్న క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము వేసి వేగించాలి. ఆ తర్వాత  కూరగాయలు మొక్కలు లేదా చికెన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో కొన్ని నీటిని పోసి ఉప్పును వేసి వాటిని కాసేపు ఉడికించాలి.
 

నీరు మొత్తం ఇంకిన తర్వాత నూడుల్స్ వేసి కాసేపు వేయించాలి. అందులో అన్నింటిని వేసి నెమ్మదిగా కలిపి దింపేయాలి. ఇక అందులో ఎరుపు క్యాప్సికమ్ ముక్కలను అలంకరించుకుంటే నూడుల్స్ రెడీ అయినట్లే.

Latest Videos

click me!