నిజాం స్టైల్ లో హైదరాబాద్ కీమా తయారీ ఎలా చేయాలంటే..!

First Published | Oct 1, 2021, 2:34 PM IST

 ఇక మటన్ తినడం ఇష్టం లేని వారు సైతం కూడా. మటన్ కీమాను ఇష్టపడతారు. దానిలో ఉన్న ప్రత్యేకతే అది. ఈ మటన్ కీమాను.. హైదరాబాద్ స్టైల్ లో వండితే ఎలాంటివారైనా ఫిదా కావాల్సిందే. దీని తయారీ కూడా చాలా సులభం కావడం గమనార్హం.

హైదరాబాద్ అనగానే అందరినీ ముందుగా బిర్యానీ గుర్తుకు వస్తుంది. అయితే.. హైదరాబాద్ లో బిర్యానీ ని మించి చాలా రకాల ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో మొఘల్,  పెర్షియన్, టర్కిష్ వంటకాలు కూడా చాలా ప్రసిద్ధి. ఈ కాంబినేషన్లకు తెలుగు టచ్ తగిలి.. మరింత రుచిని అందిస్తున్నాయి.

ఇప్పటి వరకు మీరు  చాలా వంటకాలు రుచి చూసే ఉంటారు. వాటితో పాటు ప్రతి ఒక్కరూ కచ్చితంగా రుచి చూడాల్సిన మరో వంటకం ఉంది. అదే హైదరాబాదీ కీమా.  నిజాం స్టైల్ లో దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..


నాన్ వెజ్ ప్రియులు అత్యంత ఇష్టంగా తీసుకునే ఆహారంలో మటన్ కూడా ఉంటుంది. ఇక మటన్ తినడం ఇష్టం లేని వారు సైతం కూడా. మటన్ కీమాను ఇష్టపడతారు. దానిలో ఉన్న ప్రత్యేకతే అది. ఈ మటన్ కీమాను.. హైదరాబాద్ స్టైల్ లో వండితే ఎలాంటివారైనా ఫిదా కావాల్సిందే. దీని తయారీ కూడా చాలా సులభం కావడం గమనార్హం.
 

ముందుగా స్టవ్ వెలిగించుకొని.. దానిపై ప్రెజర్ కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడైన తర్వాత నూనె వెయ్యాలి. అందులో ముందుగా చిన్న ముక్కలుుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చీ వేయాలి. వీటిని బాగా వేయించాలి. ఆ తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ జత చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత.. అందులో శుభ్రం చేసి ఉంచుకున్న మటన్ కీమాను చేర్చాలి.
 

మటన్ కీమా ఉడికి అంందులో నీరు ఊరుతుంది. ఆ నీరు పోయేంత వరకు ఆగాలి. ఆ తర్వాత అందులో.. పసుపు, ఉప్పు, ఎర్రమిరపకాయల కారం, కొద్దిగా మిరియాల పొడి, టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో కొద్దిగా నీరు పోసి.. కుక్కర్ మూత పెట్టి.. మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి.

మామూలుగా అయితే.. మటన్ ఉడకడటానికి సమయం పడుతుంది. అదే.. ప్రెజర్ కుక్కర్ లో అయితే.. సులభంగా అవుతుంది.  కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి..  అందులో కొత్తమీర, కస్తూరీ మేతీ వేసి బాగా కలపాలి. ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసుకొని.. సరిపోకపోతే తగినంత వేసుకోవాలి. అంతే.. రుచికరమైన నిజాం స్టైల్ హైదరాబాదీ మటన్ కర్రీ రెడీ. ఇది రైస్ లోకీ, ,చపాతీ, రోటీల్లో కి కూడా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. మటన్ కీమా ఆరోగ్యానికి కూడా చా లా మంచిది. 

Latest Videos

click me!