అంజీరా పండ్లను చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. కానీ.. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ,జింక్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయిన వెచ్చదనాన్ని అందిస్తుంది. వీటిని నీటిలో లేదంటే.. పాలల్లో నానపెట్టి తినడం వల్ల.. శరీరానికి అవసరమైన బలాన్ని అందిస్తాయి. ఎవరైనా శరీరంలో రక్తం తక్కువగా ఉండి బాధపడుతున్నట్లయితే ఇది తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు.