Cooked rice
మన దేశంలో ప్రధాన ఆహారం అన్నం. ప్రతి ఒక్కరం చిన్నతనం నుంచే అన్నం తింటూ పెరుగుతూ వస్తున్నాం. ఒక్కపూట అన్నం కాకుండా మరేదైనా తింటే.. అసలు భోజనం చేసిన అనుభూతి కూడా చాలా మందికి ఉండదు. ఒక్కముద్దైనా రైస్ పొట్టలో పడాల్సిందే. అయితే... షుగర్ పేషెంట్స్ కి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాపం షుగర్ వచ్చినప్పటి నుంచి నచ్చినట్లుగా అన్నం తినలేరు.
వైట్ రైస్ తగ్గించేయమని, దాని బదులు జొన్నన్నం, చపాతీలు లాంటివి తినమని సలహా ఇస్తూ ఉంటారు. పాపం.. వాళ్లకు మామూలు అన్నం కాకుండా.. జొన్నన్నం, చపాతీలు తినడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే.. ఇక నుంచి ఆ బాధ లేదు. మీరు హ్యాపీగా.. వైట్ రైస్ ని ఆస్వాదించవచ్చు. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెులుసుకుందాం...
షుగర్ పేషెంట్స్ ని వైట్ రైస్ తినొద్దని అందరూ సలహా ఇస్తారు.. ఎందుకంటే.. అన్నం తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. అందుకే.. వీలైనంత వరకు అన్నం తగ్గించమని, అసలు తినొద్దని సలహా ఇస్తూ ఉంటారు. అయితే.. ఒక సింపుల్ చిట్కా ఫాలో అవ్వడం వల్ల అన్నం తిన్నా కూడా.. షుగర్ లెవల్స్ పెరగవట.
అసలు వైట్ రైస్ తింటే రక్తంలో షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతాయి అంటే... బియ్యాన్ని ప్రాసెస్ చేయడం ద్వారవా వైట్ రైస్ ఉత్పత్తి అవుతుంది. నిర్ణీత సమయంలో, దాని పొట్టు (కఠినమైన రక్షణ పూత), ఊక (బయటి పొర) జెర్మ్ (పోషకాలు అధికంగా ఉండే కోర్) కొట్టుకుపోతాయి, ఫలితంగా విటమిన్లు, ఖనిజాలు, అనేక ఇతర పోషకాలు తక్కువగా ఉంటాయి. పోషకాలను కోల్పోవడం వల్ల కొందరు దీనిని ఖాళీ కార్బ్‌గా కూడా భావిస్తారు. ఈ కారకాలు గ్లైసెమిక్ ఇండెక్స్‌లో అధికంగా ఉండేలా చేస్తాయి, ప్రజలు తెల్ల బియ్యాన్ని టైప్ 2 డయాబెటిస్‌కు ఎక్కువ ప్రమాదం ఉందని భావిస్తారు.
అయితే, కొన్ని అధ్యయనాలు సరిగ్గా వ్యతిరేకం. యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన పరిశోధనలో, తెల్ల బియ్యం మాత్రమే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచదని కనుగొన్నారు. తెల్ల బియ్యాన్ని తప్పుడు ప్రత్యామ్నాయంతో భర్తీ చేయడం మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనం చూపిస్తుంది.
మనం చేయాల్సిందల్లా.. అన్నం వండే సమయంలో.. బియ్యంలో ఒక స్పూన్ నెయ్యి జోడించి..వండుకోవాలి. లేదంటే.. అన్నం తినే సమయంలో అయినా సరే.. ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తినాలి. ఇలా చేయడం వల్ల.. షుగర్ లెవల్స్ పెరుగుతాయనే భయం ఉండదట. ఎలా అంటే.. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.. ఇక తెల్ల అన్నంలో.. గ్లెసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది.. ఇది షుగర్ లెవల్స్ ని పెంచుతుంది. అదే నెయ్యి కలపడం వల్ల... షుగర్ లెవల్స్ అమాంతం పెరగకుండా కంట్రోల్ చేయగలుగుతుందట. దీని వల్ల.. మనం షుగర్ లెవల్స్ పెరుగుతాయనే భయం ఉండదు. హ్యాపీగా అన్నంని ఆస్వాదించవచ్చు.
అంతేకాకుండా.. అన్నంలో నెయ్యి కలపడం వల్ల.. అది ప్రోబయోటిక్ గా పని చేస్తాయి. జీర్ణ క్రియకు కూడా మంచిగా సహాయపడతాయి. రక్తంలో షుగర్ పెరగడాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా.. నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఎక్కువ సేపు మన కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. ఇతర చిరు ఆహారాలు తినకుండా కంట్రోల్ చేస్తుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే.. మీరు తీసుకునే ఆహారంలో ఒక స్పూన్ నెయ్యి కలిపి.. ఎలాంటి భయం లేకుండా.. మీ ఆహారాన్ని ఆస్వాదించేయండి.