పరగడుపున బొప్పాయి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

First Published | Jul 19, 2024, 12:52 PM IST

నిజానికి పండ్లను ఉదయాన్నే తినకూడదు అని చాలా మంది చెబుతుంటారు. కానీ.. బొప్పాయి మాత్రం అలా కాదట. హ్యాపీగా.. ఉదయాన్నే ఒక కప్పుడు బొప్పాయి ముక్కలను తినేయవచ్చట. 

Papaya Seeds

బొప్పాయి పండును ఇష్టపడనివారు చాలా అరుదుగా ఉంటారు. ఈ పండు తినడం వల్ల.. మన శరీరానికి చాలా ప్రయోజనాలు అందుతాయి.  అయితే.. సాధారణంగా ఈ పండును ఎవరైనా బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేదంటే...ఈవెనింగ్ స్నాక్ రూపంలో తీసుకుంటారు. కానీ.. బొప్పాయి పండును ఉదయం బ్రేక్ ఫాస్ట్ రూపంలో ఎప్పుడైనా తీసుకున్నారా..? అలా తినడం వల్ల మనకు లాభమా నష్టమా..? అసలు బొప్పాయి పండు పరగడుపున తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

నిజానికి పండ్లను ఉదయాన్నే తినకూడదు అని చాలా మంది చెబుతుంటారు. కానీ.. బొప్పాయి మాత్రం అలా కాదట. హ్యాపీగా.. ఉదయాన్నే ఒక కప్పుడు బొప్పాయి ముక్కలను తినేయవచ్చట.  మరి.. తినడం వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకోవాలిగా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.


బొప్పాయి పండు తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అయితే.. రుచి మాత్రమే పోషకాల గని. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఈ బొప్పాయిలో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఇందులో లుటిన్ వంటి అంశాలు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. 


ఇన్ని పోషకాలు ఉన్న బొప్పాయిని.. పరగడుపున తినడం వల్ల.. దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయట.  ముఖ్యంగా.... ఎవరైనా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నట్లయితే... ఆ సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడతారట. ఖాళీ కడుపుతో తినడం వల్ల.. జీర్ణ వ్యవస్థ బలంగా మారుతుంది.  అలాగే బొప్పాయిలో పీచు పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని తిన్న తర్వాత మలబద్ధకం సమస్యను దూరం చేయడమే కాకుండా పొట్టను ఎలాంటి ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంచుతుంది. అలాగే, ఈ పండు ఎసిడిటీ , అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.


మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినండి. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగానూ, ఫైబర్ అధికంగానూ ఉంటుంది.  బొప్పాయి తింటే చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది మీరు అతిగా తినకుండా నిరోధిస్తుంది. అలాగే, మీరు మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

బొప్పాయిలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ పండును తింటే, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు , ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
 

papaya


మీ శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నట్లయితే లేదా మీకు మధుమేహం లేదా గుండె జబ్బులు వంటి సమస్యలు ఉన్నట్లయితే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినండి. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి..  ప్రతిరోజూ  బొప్పాయి పండును మీ డైట్ లో చేర్చుకొని ఈ ప్రయోజాలన్నీ పొందవచ్చు. 

Latest Videos

click me!