కుంకుమపువ్వు, నిద్రను మెరుగుపరుస్తుంది: కుంకుమపువ్వు అనేది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ల సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలో మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఫలితంగా.. ప్రశాంతంగా అనిపిస్తుంది. హ్యాపీగా నిద్రపట్టేలా సహాయపడుతుంది.
మీ ఆహారంలో బ్లాక్ రైసిన్ , కుంకుమపువ్వు నీటిని ఎలా చేర్చుకోవాలి?
పోషకాహార నిపుణుల ప్రకారం...మీరు ఒక గ్లాసులో కొన్ని నల్ల ఎండుద్రాక్షలు , కొన్ని కుంకుమపువ్వులు తీసుకోవాలి. నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు, ఆరు నుంచి ఎనిమిది ఎండు ద్రాక్ష వేసి నాననివ్వాలి. కనీసం ఆరు గంటలు నాననిచ్చి.. పడుకునే ముందు.. వడకట్టుకొని తాగితే సరిపోతుంది.