దోశ పిండి పులిసిపోయిందా? అయితే ఇలా చేయండి

First Published | Sep 3, 2024, 12:35 PM IST

రెండు మూడు రోజుల్లోనే దోశ, ఇడ్లి పిండి పుల్లగా పులిసిపోతుంది.పులిసిపోయిన పిండితో చేసిన దోశలు పుల్లగా ఉండటం వల్ల తినాలనిపించదు. కానీ మీరు కొన్ని ట్రిక్స్ ను ఫాలో అయితే పులుపు తగ్గుతుంది. 
 

ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ను తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అయితే చాలా మంది ఉదయాన్నే ఇడ్లీలు, దోశలను తింటుంటారు. పిల్లల నుంచి ఆఫీసులకు వెళ్లే వారికి వరకు ప్రతి ఒక్కరూ దోశలను, ఇడ్లీలను తినడానికి బాగా ఇష్టపడతారు.

వీటిని కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీతో తింటే బలే టేస్టీగా ఉంటుంది. అయితే చాలా సార్లు దోశ పిండి, ఇడ్లి పిండి రోజు మూడు రోజులు కూడా వస్తుంటుంది. కానీ ఇది రెండు రోజులకు మించి ఉంటే పిండి పుల్లగా పులిసిపోతుంది. ఇలాంటిపిండితో చేసిన దోశలను ఎవ్వరూ తినరు.

ఆ పిండిని ఏం చేయాలో తెలియక చాలా మంది దీన్ని పారేస్తుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో పులుపును తగ్గించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కొబ్బరి పాలు: కొబ్బరి పాలను మనం ఎన్నో వంటల్లో ఉపయోగించొచ్చు. దీన్ని ఉపయోగించి చిక్కటి గ్రేవిని తయారుచేయొచ్చు. అంతేకాదు దోశ పిండి పుల్లగా మారితే అందులో కొబ్బరి పాలను కూడా పోయొచ్చు. లేదా కొబ్బరి పొడిని కలపాలి. ఇలా చేయడం వల్ల పిండిలోని పులుపు చాలా వరకు తగ్గుతుంది.

అల్లం పేస్ట్:  దోశ పిండి రుచిలో కొద్దిగా పుల్లగా ఉంటే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ను వేయండి. దీన్ని తయారుచేయడానికి కొద్దిగా అల్లం, పచ్చిమిర్చిని తీసుకొని దాని పేస్ట్ గా చేయండి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను పిండిలో బాగా మిక్స్ చేయండి. ఇది పులుపును తగ్గిస్తుంది. 

Latest Videos


బియ్యం లేదా సెమోలినా పిండి:  బియ్యం పిండి, సెమోలీనా పిండితో కూడా మీరు ప్రయోగాలు చేయొచ్చు. అవును పుల్లగా మారిన దోశె పిండిలో కొద్దిగా బియ్యప్పిండి లేదా సెమోలినా కలుపుకోవడం వల్ల పిండిలో ఉండే పులుపు చాలా వరకు తగ్గుతుంది.

ఇడ్లీ పిండి పుల్లగా మారితే ఏం చేయాలి?

ఇడ్లీ పిండి కూడా అప్పుడప్పుడు మిగులుతుంటుంది. అయితే ఈ పిండిలో పులుపును తగ్గించడానికి మీరు పచ్చిమిర్చి, అల్లం పేస్టు ని కలపండి. లేదా పచ్చి మిర్చి ముక్కలు, తరిగిన అల్లను వేసి బాగా కలపండి. ఇది ఇడ్లీ పిండిలోనే కాకుండా.. దోశపిండిలోని పులుపును కూడా తగ్గిస్తుంది. 

బెల్లం లేదా చక్కెర 

ఇడ్లి పిండి లేదా దోశ పిండి  పులిసిపోతే బెల్లాన్ని లేదా చక్కెరను వాడండి. ఈ రెండూ పిండిలో పులుపును తగ్గించడానికి సహాయపడతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ వీటిని మరీ ఎక్కువగా వేయకూడదు. లేదంటే దోశలు, ఇడ్లీలు తీయగా, టేస్ట్ లెస్ గా అవుతాయి. పిండి ఎక్కువ పులిసిపోతే మీరు దానికి కొంచెం ఫ్రెష్ పిండిని కలిపినా పులుపు తగ్గుతుంది. ఇడ్లీలు, దోశలు కూడా టేస్టీగా అవుతాయి.

click me!