గత వారం రోజులుగా కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. ఈ క్రమంలో ఎక్కువ మంది జబ్బుల బారినపడుతూ ఉంటారు. చాలా రకాల ఇన్ఫెక్షన్లు మనపై దాడి చేయడం మొదలుపెడతాయి. ముందుగా, జ్వరం, జలుబు, దగ్గు లాంటి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి.
వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల.. హానికరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. దీని కారణంగానే ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఈ వర్షాకాలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మన జీర్ణ క్రియ బలహీనంగా మారుతుంది. అందుకే.. ఈ సీజన్ లో.. చాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అంతేకాదు.. ఎక్కువగా ఉడకపెట్టిన ఆహారం తీసుకోవాలి. అప్పుడు సులభంగా జీర్ణమౌతుంది.