Sugar patients: షుగర్ పేషెంట్లు వీటిని తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Published : Mar 06, 2025, 02:56 PM IST

షుగర్ పేషెంట్లు తినే, తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే కొన్ని కూరగాయలను వాళ్ళ డైట్ లో చేర్చుకోవడం ద్వారా షుగర్ ని నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
Sugar patients: షుగర్ పేషెంట్లు వీటిని తింటే ఎన్ని లాభాలో తెలుసా?

షుగర్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల కళ్ళు, మూత్రపిండాలు, కాలేయం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. షుగర్ పేషెంట్లు తమ ఆహారంలో ఏ కూరగాయలను చేర్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

26
క్యారెట్

క్యారెట్‌లో ఫైబర్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, పొటాషియం లాంటి పోషకాలు ఉన్నాయి. ఇవి షుగర్ పేషెంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని ఉడకబెట్టి కూడా తినవచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

36
బెండకాయ

బెండకాయ రుచికరమైంది మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, కాల్షియం లాంటి పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్ షుగర్ పేషంట్లకు చాలా మంచిది. ఇది ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

46
బ్రోకోలీ

షుగర్ పేషెంట్లు వారి ఆహారంలో ఖచ్చితంగా బ్రోకోలీని చేర్చుకోవాలి. ఇందులో ఐరన్, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ సి లాంటి పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే సల్ఫోరాఫేన్ రక్త నాళాలు దెబ్బతినకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. బ్రోకోలీలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూరగాయగా లేదా సూప్‌గా కూడా తీసుకోవచ్చు.

56
ఆకు కూరలు

ఆకు కూరలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు తప్పనిసరిగా ఆకు కూరలు తినాలి. కావాలంటే వీటిని సూప్ లేదా సలాడ్ రూపంలో తినవచ్చు.

 

66
దోసకాయ

దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది. పరిశోధన ప్రకారం, దోసకాయ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. దీన్ని సలాడ్ లేదా కూరగాయలతో కలిపి తినవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories