పాలు మరిగేటప్పుడు, దానిని గ్యాస్ నుండి తీసి చల్లబరచండి. పాలు గోరువెచ్చగా మారినప్పుడు, అది పెరుగు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో చాలా కొంచెం పెరుగు తోడు వేయాలి. తర్వాత స్పూన్ తో కలపాలి. ఇప్పుడు ఆ పాలను ఒక మట్టి కుండలో పోసి.. అల్లూమినియం ఫాయిల్ తో కవర్ చేయాలి. అంతే... ఐదారు గంటల్లో మీకు కమ్మని, చిక్కని , రుచికరమైన పెరుగు తయారైనట్లే..